AP CM YS Jagan: సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ దంపతులు

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలు పాల్గొన్నారు.

AP CM YS Jagan: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. భోగి సందర్భంగా తెల్లవారు జామునే నిద్రలేచి భోగి మంటలతో ప్రతీ గ్రామం సందడిగా మారింది. ఇంటిముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో పల్లె, పట్టణ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలు పాల్గొన్నారు.

AP CM Jagan

భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ సామాగ్రి, ఎండ్ల బండ్లు, గడ్డి వాములు, పశుసంపద, కుల వృత్తుల చిత్రాలతో పల్లె వాతావరణాన్ని ప్రతిభించేలా ఏర్పాటు చేశారు. అంతేకాక, నవరత్నాల పేరుతో ఏపీ ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలతో కూడిన చిత్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా  గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాల వంటి వాటిని ఏర్పాటు చేశారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన పరిసరాలను సీఎం జగన్ దంపతులు ఆసక్తిగా తిలకించారు.

 

AP CM Jagan

తొలుత సీఎం జగన్ దంపతులు జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం గోశాలలో గోపూజ చేశారు. ఆ తరువాత సీఎం జగన్ భోగి మంటలను వెలిగించి హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు. అదేవిధంగా ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన శ్రీనివాస కల్యాణం ప్రదర్శనను సీఎం జగన్ దంపతులు ఆసక్తిగా తిలకించారు.

ట్రెండింగ్ వార్తలు