చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉంది.. మోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు : మంత్రి బొత్స

ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను మోదీ చదివాడు. రైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు. బీజేపీ, టీడీపీ. జనసేన తోడు దొంగలని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Minister Botsa Satyanarayana : ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ఆలోచనలు నీచంగా, దుర్మార్గంగా ఉన్నాయి. కూటమి నీచపు బుద్దితో పింఛన్లు అడ్డుకోవడం వల్ల సుమారు 30మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని బొత్స ఆరోపించారు. కూటమి పార్టీలు వైసీపీ ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ను కూడా అడ్డుకుంటున్నారు. నిధులు సిద్ధం చేసినప్పటికీ పథకాల లబ్ధిని టీడీపీ అడ్డుకుంటుంది. రైతులకు జరిగే మేలును కూడా కూటమి పార్టీలు అడ్డుకుంటున్నాయని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : CM Jagan : చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే: సీఎం జగన్

2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది. మేము అడ్డుకోలేదు. కూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలని బొత్స సత్యనారాయణ సూచించారు. టీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికలు అయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని బొత్స చెప్పారు. కూటమి పార్టీలకు ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారు. చంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని బొత్స విమర్శించారు. బాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. చంద్రబాబుది మనిషి పుట్టుకేనా? ఆయన పేరెత్తడానికి అసహ్యంగా ఉందంటూ బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిబంధనలకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఈసీ వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాలని బొత్స సూచించారు.

Also Read : Cm Revanth Reddy : ఈటల రాజేందర్, కేసీఆర్ వేర్వేరు కాదు- సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను మోదీ చదివారు. రైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు. బీజేపీ, టీడీపీ. జనసేన తోడు దొంగలు అని మంత్రి బొత్స విమర్శించారు. మోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదు. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదు. నా రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదనంటూ బొత్స అన్నారు. మోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు. మోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు. పార్లమెంట్ లో రాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపామని బొత్స చెప్పారు.

 

 

ట్రెండింగ్ వార్తలు