Nara Bhuvaneswari: హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలకు నారా భువనేశ్వరి కౌంటర్.. చూసిందే నమ్మండి అంటూ వీడియో రిలీజ్
ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుందని భరోసా ఇచ్చారు.
Nara Bhuvaneswari Representative Image (Image Credit To Original Source)
- ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తున్నాం
- ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం
- నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు
Nara Bhuvaneswari: హెరిటేజ్ సంస్థపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఆ సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి స్పందించారు. చూసిందే నమ్మండి అంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారామ. 33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తున్నామన్నారు. ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. రూ.4 కోట్లతో చిన్న సంస్థగా తమ ప్రయాణం ప్రారంభించామని, ఇప్పుడు రూ.4వేల కోట్లకు పైగా విలువైన సంస్థగా ఎదిగాం అన్నారు. నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదన్నారు.
ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుందని భరోసా ఇచ్చారు. 500 మందికి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది రైతులతో మేము పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నామని భువనేశ్వరి వివరించారు. తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన వీడియోను పూర్తిగా చూడాలని కోరారు. నిజాన్ని మీరే చూడండి. ఎందుకంటే చూసిందే నమ్మండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు నారా భువనేశ్వరి.
#HeritagePromise – చూసిందే నమ్మండి
33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు.ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు… pic.twitter.com/xan0wUyxz7
— Nara Bhuvaneswari (@ManagingTrustee) February 19, 2026
Also Read: టీడీపీ కంచుకోటలో తమ్ముళ్ల ధిక్కారం.. ఉండిలో అసలేం జరుగుతోంది? రాజుగారిపై ఆరోపణల్లో నిజమెంత?
