Chintamani : చింతామణి నాటకంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం, ప్రదర్శిస్తే కఠిన చర్యలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చింతామణి నాటక ప్రదర్శనలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Chintamani : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చింతామణి నాటక ప్రదర్శనలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకం ప్రదర్శించకూడదు. ఒకవేళ ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. కాగా, ఈ నాటకంలోని ఓ పాత్ర వైశ్యులను కించపరిచేలా ఉందని, నాటక ప్రదర్శనను నిషేధించాలంటూ ప్రభుత్వానికి ఆర్యవైశ్య మహాసభ విజ్ఞప్తి చేసింది. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. బ్యాన్ విధిస్తూ డెసిషన్ తీసుకుంది.

Obesity : స్థూలకాయానికి ఆహారంలో మార్పులతో పాటు..

గ్రామీణ ప్రాంతాల్లో చింతామణి నాటకం అంటే తెలియని వారు ఉండరు. పల్లెల్లో అంతగా ప్రాచుర్యం పొందింది ఈ నాటకం. సమాజాన్ని ప్రభావితం చేయటంలో నాటకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా చింతామణి నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని, సమాజాన్ని సంస్కరించే బదులు వ్యసనాల వైపు మళ్లిస్తుందని, ఈ నాటకాన్ని వెంటనే నిషేధించాలని ఆర్య వైశ్య సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

Dolo 650: రికార్డ్ స్థాయిలో డోలో సేల్స్… 10 నెలల్లో రూ.567 కోట్లు

తెలుగు నాటక రంగంలో చింతామణికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 20వ శతాబ్దం మొదట్లో అప్పటి ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకానికి మంచి ఆదరణ ఉంది. చింతామణి నాటకాన్ని తొలిసారిగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రామ్మోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు. ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, శ్రీహరి, భవానీ శంకరం పాత్రలు కీలకం. అయితే నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర చింతామణి అనే స్త్రీ వ్యామోహంలో పడి ఆస్తిపాస్తులు పోగొట్టుకుంటాడు. ఆ పాత్ర తమను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ ఆర్యవైశ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు