APSRTC Reduce Fares : ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీలు తగ్గింపు

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గించింది. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో 20 శాతం వరకు చార్జీలు తగ్గిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది.

APSRTC Reduce Fares : ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గించింది. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో 20 శాతం వరకు చార్జీలు తగ్గిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. తగ్గిన ఛార్జీలు ఈనెల 30 వరకు అమలులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది.

రూట్లు, చార్జీలు ఎంత తగ్గించాలనే నిర్ణయం ఆర్ఎంలకు అప్పగించింది. విజయవాడ-హైదరాబాద్ ఏసీ బస్సులో 10 శాతం ఛార్జీలు తగ్గించింది. అమరావతి, గరుడ, వెన్నెల బస్సు ఛార్జీల్లో 10 శాతం తగ్గిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవాడ-విశాఖ డాల్ఫిన్ క్రూజ్ బస్సుల్లో 20 శాతం ఛార్జీ తగ్గించారు.

Palle Velugu Buses : ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..పల్లె వెలుగు బస్సుల రంగు మార్పు

విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే బస్సుల్లో 20 శాతం ఛార్జీలు తగ్గించింది. అమరావతి, వెన్నెల బస్సుల్లో శుక్ర, ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఛార్జీలు తగ్గించారు.

ట్రెండింగ్ వార్తలు