cannabis smuggling : సినిమాలు సమాజంపై ఎంత ప్రభావం చూపిస్తాయో చెప్పేందుకు పుష్ప సినిమాను ఉదాహరణగా తీసుకోవచ్చేమో.. సినిమాల్లోని మంచి వదిలేసి.. చెడునే స్ఫూర్తిగా తీసుకుని రియల్ లైఫ్‌లోనూ ఆ ఐడియాలను వాడేస్తున్నారు. తాజాగా పుష్ప సినిమా ప్రభావంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పుష్ప సినిమాలో తరహాలో పోలీసుల చేతికి చిక్కకుండా కొత్త కొత్త పద్ధతుల్లో అక్రమంగా తరలిస్తున్నారు.
ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు.. కానీ విజయనగరం జిల్లాలో సినిమా ఐడియా కాపీ కొట్టి స్మగ్లర్ అడ్డంగా బుక్కయ్యారు. జిల్లాలోని శృంగవరపుకోట మండలం బొడ్డవరం చెక్ పోస్టు వద్ద పోలీసులకు ఎటువంటి అనుమానం కలగకుండా పుష్ప సినిమా ఫక్కీలో ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ లో గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులకు వారి కదలికలపై అనుమానం రావడంతో బొడ్డవరం చెక్ పోస్టు వద్ద ఆయిల్ ట్యాంకర్ ను తనిఖీ చేశారు.
Red Sanders: చంద్రగిరి పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం పట్టివేత
దీంతో గంజాయి వ్యవహారం గుట్టురట్టు అయింది. ఆయిల్ ట్యాంకర్ నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్ ను శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంజాయి ఎక్కడిది? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కూడా పుష్ప మూవీ సీన్ రిపీట్ అయింది. టమోటా రవాణా ముసుగులో ఓ స్మగ్లర్ ఎర్రచందనం తరలిస్తూ.. పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. లగేజీ ఆటోలో పైన టమోటాలు, కింద ఎర్రచందనం దుంగలు సరఫరా చేస్తుండగా… చంద్రగిరి మండలం మూలపల్లి అటవీప్రాంతం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
CM KCR : రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్
అనుమానం రావడంతో ఆటోను నిశితంగా పరిశీలించారు. ఆటోలో ఎర్రచందనం దుంగలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని.. స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.