Brahmani Nara : మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు- పోలీసులపై నారా బ్రాహ్మణి ఆగ్రహం

జగన్ ప్రభుత్వానికి ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. Brahmani Nara

Brahmani Nara (Photo : Twitter)

Brahmani Nara – Police : పోలీసుల తీరుపై నారా బ్రాహ్మణి మండిపడ్డారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని ఆమె తప్పు పట్టారు. మహిళల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. ప్రైవేట్ ఫోన్ లో డేటా సేకరణ, హోటల్ గదులకు తాళాలు వేయటాన్ని ఎలా సమర్ధించుకుంటారు? అని ప్రశ్నించారు. ఉద్యోగాల సృష్టికి పితామహుడిగా చంద్రబాబుని గుర్తించిన ఐటీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు నారా బ్రాహ్మణి. వేలాదిమంది ఐటీ ఉద్యోగులు రాజమండ్రి రాకుండా పోలీసులు అడ్డుకోవటం దురదృష్టకరం అని వాపోయారు.

కాగా, చంద్రబాబుకి మద్దతుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చిన ఐటీ ఉద్యోగులను కలిశారు నారా బ్రాహ్మణి. వారిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. కాగా, వారిపై పోలీసుల ఆంక్షలు దారుణం అని ధ్వజమెత్తారు. వాహనదారుల ఫోన్లను పోలీసులు చెక్ చేయడం షాక్ కి గురి చేసిందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని, అందరూ ఓట్లను చెక్ చేసుకోవాలని సూచించారు.

Also Read..Motkupalli Narasimhulu : చివరికి దేవాన్షును కూడా జగన్ అరెస్ట్ చేస్తాడేమో! చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మోత్కుపల్లి నిరసన దీక్ష

చంద్రబాబు అరెస్ట్ ని నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కార్ల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఏపీ-తెలంగాణ బోర్డర్ లో భారీగా పోలీసులు మోహరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటతో పాటు ఖమ్మం జిల్లా నుంచి ఏపీలోకి ప్రవేశించే అన్ని రోడ్లపై చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అటుగా వచ్చిన అన్ని వాహనాలను తనిఖీ చేశారు. అలాగే వాహనదారుల ఫోన్లు కూడా చెక్ చేశారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే వారిని ఏపీలోకి అనుమతించారు. కాగా, దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పోలీసుల చర్యతో తమ ప్రైవసీకి భంగం కలిగిందని వాహనదారులు వాపోయారు.

Also Read..Chandrababu Interrogation : మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? చంద్రబాబుని అడిగిన ఏసీబీ కోర్టు జడ్జి

కాగా, చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ విప్రో సర్కిల్ వద్ద పలువురు ఉద్యోగులు ఐయామ్ విత్ సీబీఎన్ ప్లకార్డులతో చంద్రబాబుకి మద్దతు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజాగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ర్యాలీగా వచ్చి చంద్రబాబుకి సంఘీభావం తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు