Brother Anil Kumar: ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టే ఆలోచన లేదు: బ్రదర్ అనిల్ కుమార్

ప్రముఖ మత బోధకుడు, వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్.. విశాఖలో పలు సంఘాల నేతలతో బిజీ బిజీగా గడుపుతన్నారు.

Brother Anil Kumar: ప్రముఖ మత బోధకుడు, వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్.. విశాఖలో పలు సంఘాల నేతలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఉత్తరాంధ్ర ఎస్సి, ఎస్టీ, బీసీ సంఘాల నేతలతో బ్రదర్ అనిల్ కుమార్ సోమవారం సమావేశం అయ్యారు. ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో సమావేశం అయిన అనిల్ కుమార్ విజయవాడలోనూ పలు సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ఈక్రమంలో నేడు విశాఖలో నిర్వహించిన మీటింగ్ కు ఆసక్తికరంగా మారింది. సమావేశ విరామ సమయంలో బ్రదర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also read: CM Jagan : మద్యపానం తగ్గించాలన్నదే మా లక్ష్యం : సీఎం జగన్

ఉత్తరాంధ్ర ఎస్సి, ఎస్టీ, బీసీ సంఘాల నేతలతో సమావేశం అయ్యానని..తమ పరిస్థితిని వినేవాళ్ళు ఎవరు లేరని నేతలు చెప్పుకొచ్చారని అనిల్ కుమార్ అన్నారు. ఎన్నికల ముందు వాళ్ళ సహాయం అడిగానన్న అనిల్ కుమార్.. ఎన్నికల అనంతరం ఆ సంఘాలు తమ ఆకాంక్షలు నెరవరలేదని అసంతృప్తి గా ఉన్నట్లు తెలిపారు. పాఠశాల వ్యవస్థలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన మార్పులతో.. క్రిస్టియన్ చారిటీ నిధులతో నడుస్తున్న పాఠశాలలు నష్టపోతున్నాయని ఆయా సంఘాల వారు తన దృష్టికి తీసుకువచ్చినట్లు అనిల్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై తమ సమస్యను విన్నవించుకునేందుకు సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరినా..ప్రభుత్వం నుంచి ఎవరు పట్టించుకోవడంలేదని ఆయా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బ్రదర్ అనిల్ తెలిపారు.

Also read: AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ నాకు అవసరం లేదన్న అనిల్ కుమార్.. సీఎంగా ఆయన చాలా బిజీగా ఉన్నారని.. తాను కలిసి కూడా రెండున్నర సంవత్సరాలు అయిందని అన్నారు. ఉత్తరాంధ్ర ఎస్సి, ఎస్టీ, బీసీ సంఘాల నేతలతో నేడు చర్చించిన మేరకు ఏపీలో కొత్త పార్టీ పెట్టాలని వారు తనను కోరారని.. అయితే పార్టీ పెట్టడం చాలా పెద్ద విషయమని బ్రదర్ అనిల్ చెప్పుకొచ్చారు. బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చెయ్యాలని సమావేశం సందర్భంగా కొందరు సూచించారని కచ్చితంగా అభిమానుల కోరికను మేము నెరవేస్తామని అనిల్ కుమార్ అన్నారు. త్వరలో సీఎం జగన్ అపాయింట్మెంట్ తీసుకుని.. ఎన్నికల ముందు సహాయం చేసిన సంఘాల గురించి ముఖ్యమంత్రి జగన్ చెప్పే ప్రయత్నం చేస్తానని బ్రదర్ అనిల్ పేర్కొన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను వ్యక్తిగత పనిపై కలిశానన్న అనిల్ కుమార్.. ఏపీలో పార్టీ పెట్టె ఆలోచనలో లేమని స్పష్టం చేశారు.

Also read: Rajamouli : కాసేపట్లో జగన్‌ని కలవనున్న రాజమౌళి, దానయ్య.. ఈ మీటింగ్ ఎందుకో??

ట్రెండింగ్ వార్తలు