Visakhapatnam Car Accident: విశాఖ బీచ్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న దంపతులుసహా యువకుడు మృతి

యువకులు మద్యం మత్తులో కారును వేగంగా డ్రైవ్ చేయడంతో బైక్‌పై వెళ్తున్న దంపతులతో సహా మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు.

Car Accident

Car Accident: మద్యం మత్తులో అతివేగంగా కారు డ్రైవ్ చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఎదురుగా బైక్ పై వస్తున్న వారిని ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన సోమవారం రాత్రి 10గంటల సమయంలో విశాఖపట్టణంలోని బీచ్ రోడ్డులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో భార్యభర్తలు సింగారపు పృథ్వీరాజ్ (28), ప్రియాంక్ (21)గా పోలీసులు గుర్తించారు. కారులో మరణించిన వ్యక్తిని మణికుమార్‌(25)గా గుర్తించారు. ఈ విషాదం ఘటన సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నట్లు తెలిసింది. వారిలో ముగ్గురు ఘటన స్థలం నుంచి పరారవ్వగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

Crime News: ప్రసిద్ధ పుణ్యక్షేత్ర సమీపంలో 12 ఏళ్ల బాలికను ఘోరాతి ఘోరంగా..

బీచ్ రోడ్డులో ఘోర ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదానికి గురైన కారులో పోలీసులు మద్యం సీసాలను గుర్తించారు. ఇదిలాఉంటే.. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు సాగర్‌నగర్ ఆర్చ్ వద్ద యువకులతో కారులో మద్యం సేవించిఉన్న వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. రహదారిపై మద్యం సీసాలు పగులగొట్టి హల్‌చల్ చేశారు. దీనికితోడు యువకుల వద్ద సెల్‌ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సాగర్‌నగర్ యువకులు జోడుగుళ్లపాలెం చెక్‌పోస్టు వద్ద ఫిర్యాదు చేసేందుకువ వెళ్లగా ప్రమాద సమాచారం తెలిసింది. బాధిత యువకులను ఘటనా స్థలానికి తీసుకెళ్లగా వారు కారును గుర్తించారు. సెల్‌ఫోన్‌ను బాధితులకు అందించారు.

Tank Bund Car Accident : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం

మద్యం మత్తులో కారును వేగంగా డ్రైవ్ చేసిన యువకులు.. సాగర్‌నగర్ నుంచి ఎండాడ వైపు వెళ్లారు. సరిగ్గా రాడీసన్ హోటల్ మలుపు వద్దకు వచ్చేసరికి కారు వేగాన్ని నియంత్రించలేకపోవటంతో అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొట్టి అవతిలి రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో రుషికొండ నుంచి నగరంలోకి వెళ్తున్న పృథ్వీరాజ్, ప్రియాంక దంపతుల బైక్‌ను, తరువాత చెట్టును కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. కారు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారు నడుపుతున్న యువకుడితో పాటు ముందుకూర్చున్న యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. వెను కూర్చుకున్న ఫణి కుమార్ మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తరువాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే, ప్రమాదం సమయంలో కారు 150 కిలోమీటర్ల వేగంగా ఉండిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు