AP Employees : చలో విజయవాడ.. ఉద్యోగుల అరెస్టుల పర్వం

ఏపీలో ఉద్యోగుల అరెస్ట్‌ల పర్వం మొదలైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడుగు బయటకు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేస్తున్నట్లుగా సమాచారం. బయలుదేరిన ఉద్యోగులను...

Chalo Vijayawada : ఏపీ రాష్ట్రంలో పీఆర్సీ వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా ఓ కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు కార్యాచరణ రూపొందించాయి. అందులో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. వీరిని అడ్డుకొనేందుకు పోలీసులు మోహరించారు.

Read More : ‘Anti-Suicide’ Fan Rod: ‘ఆత్మహత్య నివారణ ఫ్యాన్ కడ్డీ”ల వ్యాపారానికి రూ.50 లక్షలు నిధులు

ఏపీలో ఉద్యోగుల అరెస్ట్‌ల పర్వం మొదలైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడుగు బయటకు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేస్తున్నట్లుగా సమాచారం. బయలుదేరిన ఉద్యోగులను… పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు.. ఎక్కడ చూసిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉద్యోగుల వాహనాలను వెనక్కి పంపించి వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడకు బయలుదేరిన ఉద్యోగులు, ఉద్యోగ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతేకాదు.. నరసన్నపేట హైవేపై వాహన తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులు అన్న అనుమానంతో బస్సుల నుంచి కిందకు దింపివేస్తున్నారు.

Read More : Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వంపై లోక్‌సభ సాక్షిగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కృష్ణా జిల్లాలోనూ పోలీసులు ఉద్యోగులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. విజయవాడ – నందిగామ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. సీఐ కనకారావు ఆధ్వర్యంలో పోలీసులు అటుగా వెళ్తున్న ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. పలువురు ఉద్యోగ సంఘాల నాయకులను అరెస్ట్‌ చేస్తున్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేనందున అరెస్ట్‌ చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు