Bandi Sanjay : చంద్రబాబు అరెస్ట్ పై మరోసారి స్పందించిన బండి సంజయ్.. అప్పుడే అరెస్ట్ చేయాలా అంటూ ఫైర్

మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అంత ఆదరాబాదరగా అరెస్ట్ చేయాల్సిన పని లేదని పేర్కొన్నారు. G20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్ట్ కి సమయం కుదిరిందా అని ప్రశ్నించారు.

BJP MP Bandi Sanjay

Bandi Sanjay – Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేయడం పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు అర్థమవుతుందన్నారు. తప్పు చేస్తే అరెస్ట్ చేయడాన్ని ఎవరూ కాదనరు.. కానీ, ఎఫ్ఐఆర్ లో పేరు లేని వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదన్నారు. ఈ మేరకు గురువారం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు.

మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అంత ఆదరాబాదరగా అరెస్ట్ చేయాల్సిన పని లేదని పేర్కొన్నారు. G20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్ట్ కి సమయం కుదిరిందా అని ప్రశ్నించారు. ప్రజల్లో చంద్రబాబుకి మైలేజ్ వచ్చిందన్నారు. ఆంధ్ర వైసీపీ నాయకుల్లో ఓ చండాలమైనా అలవాటు ఉందన్నారు. తప్పును తప్పు అంటే చంద్రబాబు ఏజెంట్ లేదా పవన్ ఏజెంట్ అంటారు అని అన్నారు.

Chandrababu Arrest : జైలులో చంద్రబాబు నాయుడితో ములాఖత్ అయిన పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేశ్… live updates

కాగా, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టు, చేసి రిమాండ్ కు తరలించారు. చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా ధర్మాసనం ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. జైలులో స్నేహ బ్లాక్ లో చంద్రబాబు ఉన్నారు.

చంద్రబాబుకు ప్రత్యేక గదిని కేటాయించారు. ఇవాళ (గురువారం) జైలులో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ములాఖత్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీసులు భద్రత పెంచారు. జైలు వద్దకు జనసైనికులు, టీడీపీ అభిమానులు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు.

ట్రెండింగ్ వార్తలు