CM Jagan : ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు, సీఎం జగన్

ఆరోగ్య అసరా ద్వారా ఆపరేషన్ ద్వారా నెలకు రూ.5 వేలు ఇస్తూ రోగులకు అండగా నిలబడుతున్నామని జగన్ అన్నారు. పిల్లల కోసం తిరుపతిలో హార్ట్ కేర్ సెంటర్ ను ఓపెన్ చేశామన్నారు.

CM Jagan : ఏపీ అసెంబ్లీలో ఆరోగ్యశ్రీపై సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని సీఎం జగన్ చెప్పారు. ఆరోగ్య అసరా ద్వారా ఆపరేషన్ ద్వారా నెలకు రూ.5 వేలు ఇస్తూ రోగులకు అండగా నిలబడుతున్నామని అన్నారు. పిల్లల కోసం తిరుపతిలో హార్ట్ కేర్ సెంటర్ ను ఓపెన్ చేశామన్నారు. కోవిడ్ మహమ్మారితో ప్రజలు నష్టపోకూడదని కోవిడ్ వైద్యాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత మనదే అన్నారు. కోవిడ్ తర్వాత ఆరోగ్య సమస్యలొచ్చినా దానిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చామన్నారు. ప్రతి ఇంటికెళ్లి కోవిడ్ సర్వే చేశామని, 31 సార్లు వెళ్లి మరీ వాకబు చేశారని జగన్ చెప్పారు.

Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రిభోజనం ఎందుకంటే?

”రాష్ట్రంలో నవంబర్ 23 నాటికి 3 కోట్ల 2 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు చేశాం. కోవిడ్ పరీక్షలు అత్యధికంగా చేసిన రాష్ట్రాల్లో మనది ఒకటి. కోవిడ్ వలన చనిపోయింది .07 శాతం మాత్రమే. కోవిడ్ వచ్చినా 93 శాతం మందిని కాపాడుకున్నాం. రాష్ట్ర జనాభాలో మొదటి డోస్ ను 3 కోట్ల 41 లక్షల 59 వేల మంది తీసుకున్నారు. 2 కోట్ల 39 లక్షలు మంది రెండవ డోస్ తీసుకున్నారు. డిసెంబర్ నాటికి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పూర్తి చేస్తాం.

Red Wine : రెడ్ వైన్ మహిళల్లో మధుమేహం రాకుండా చేస్తుందా?

మార్చి నాటికి రెండవ డోస్ పూర్తి చేస్తాం. మనిషిని బతికించాలనే తపన మా ప్రభుత్వానిది. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోయే పరిస్ధితి గతంలో చూశాం. ప్రభుత్వాసుపత్రుల్లో గతంలో మందులు వేసుకోవాలంటేనే భయపడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన మందులను మాత్రమే ప్రభుత్వాసుపత్రుల్లో ఇస్తున్నాం” అని జగన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు