India Covid Vaccination : పిల్లలు, వృద్ధుల వివరాలు వెల్లడించిన కేంద్రం, తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అంటే

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లల వివరాలు, 60 ఏళ్ల పైబడిన వారి వివరాలు వెల్లడించింది కేంద్రం.

Covid Vaccination : రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లల వివరాలు, 60 ఏళ్ల పైబడిన వారి వివరాలు వెల్లడించింది కేంద్రం. 15-18 ఏళ్ళ వయసు గల పిల్లలకు,హెల్త్ వర్కర్లకు,ఫ్రంట్ లైన్ వారియర్లు, వృద్ధులకు వ్యాక్సినేషన్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సూచించారు. దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ళ వయసు గల 7.40 కోట్ల మంది పిల్లలు ఉండగా 60 ఏళ్ల పైబడి అనారోగ్యం 2.75 కోట్ల మంది ఉన్నారని తెలిపింది.ఏపీలో 15-18 ఏళ్ళ వయసు గల 24.41 లక్షల మంది పిల్లలుంటే తెలంగాణలో 15-18 ఏళ్ళ వయసు గల వారు 18.41 లక్షల మంది ఉన్నారని వెల్లడించింది. ఏపీలో 60 ఏళ్ల పైబడిన అనారోగ్యం కలిగిన 13.11 లక్షల మంది వృద్ధులున్నారని, తెలంగాణలో 8.32 లక్షల మంది వృద్ధులున్నారని పేర్కొంది.

Read More : Omicron Cases : తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు

కొద్ది రోజుల్లో భారతదేశంలో కరోనా మూడో డోస్ పంపిణీకి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దేశంలో 15 -18 సంవత్సరాల వయస్సున్న వారికి జనవరి మూడో తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇటీవలే ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం పిల్లలు వృద్ధులకి వ్యాక్సినేషన్ పై కేంద్రం సమీక్ష జరిపింది. 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, వృద్ధులకు అదనపు డోస్ వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులకు రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

ట్రెండింగ్ వార్తలు