Chandrababu Naidu : జగన్‌ని చిత్తుగా ఓడించే బాధ్యత మీది, మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత నాది- చంద్రబాబు నాయుడు

కరెంట్ ఛార్జీలు నేను ఎప్పుడైనా పెంచానా? చెత్త పన్ను ఎప్పుడైనా ఉందా? ఇసుక అప్పట్లో 10 వేలు, ఇప్పుడు 50 వేలు. Chandrababu Naidu

Chandrababu Naidu (Photo : Twitter)

Chandrababu Naidu – YS Jagan Mohan Reddy : తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ అరాచకపాలనను తెర దించాలని చంద్రబాబు కోరారు. జగన్ ని ఓడించే బాధ్యత మీది, మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు అన్నారు.

”తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు ఎంత మంచి వాళ్లో.. కోపం వస్తే మిమ్మల్ని అంత చిత్తుగా ఓడిస్తారు. నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను. కానీ, ఇంత ప్రజాదరణ చూడలేదు. ఎస్పీ గారు మీకు చెబుతున్నా పోలీసులను క్రైమ్ లో పార్టనర్లు చేయొద్దు. ఎమ్మెల్యే తప్పు చేస్తే అరెస్ట్ చేయండి. చిల్లర పనులు చేయకండి. ఒక దళిత యువకుడిని పోలీసుల సాక్షిగా కొట్టి శిరోమండనం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. దళిత డ్రైవర్ ని చెప్పి కారు డెలివరీ చేసిన మీ ఎమ్మెల్సీని జగన్ నువ్వు ఏం చేశావ్? సుధాకర్ డాక్టర్ ని పిచ్చివాడిని చేసి చంపేశారు. ఎంతమంది దళితులను పొట్టను పెట్టుకున్నారు. దళితులకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.

Also Read..Payakaraopet Constituency: పాయకరావుపేటలో అంతకుముందు అనితకు ఎదురైన పరిస్థితే.. ఇప్పుడు బాబురావుకు..

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై విజయభేరి కార్యక్రమం కోసం పురుషోత్తమ పట్నం వెళ్లాను. రాజమండ్రి నుండి రోడ్డు అధ్వానంగా ఉంది. దుర్మార్గమైన ముఖ్యమంత్రి రైతులకు నీళ్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాడు. గోదావరి పక్కనున్న ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది.
యువతకు జాబ్ క్యాలెండర్ లేదు. ఇంతవరకు డీఎస్సీ పెట్టలేదు. మీ పిల్లల భవిష్యత్తు బాధ్యత నాది. మీకు హామీ ఇస్తున్నా. జగన్ రెడ్డికి బిత్తరచూపులు తప్ప ఏం చేయాలో తెలియని వ్యక్తి. యువత శారీరకంగా కష్టపడటం కాదు తెలివితేటలతో పని చేయాలి.

మహిళలకు మహాశక్తిగా మారే విధంగా కార్యక్రమం చేపడతాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 10 వేలు చొప్పున ఇస్తా. 18 సంవత్సరాల నిండిన ఆడబిడ్డకు ప్రతి నెల 1500 ఇస్తా. ధరలు మండిపోతున్నాయి. కరెంట్ ఛార్జీలు నేను ఎప్పుడైనా పెంచానా? చెత్త పన్ను ఎప్పుడైనా ఉందా? ఇసుక అప్పట్లో 10 వేలు, ఇప్పుడు 50 వేలు. గోదావరి అంతా ఇసుక దొంగ వ్యాపారం జరుగుతోంది. ఈ డబ్బంతా తాడేపల్లి పోతోంది.

మద్యపాన నిషేధం అని చెప్పాడు. మద్యం రేట్లు పెంచాడు. 25కోట్లు అప్పు తెస్తాడంట. ఆ అప్పు తీర్చడం కోసం మీరు మద్యం తాగాలంట. మన ఆడబిడ్డలకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం. ప్రతి ఏటా రైతులకు 25వేల రూపాయలు ఆర్దిక సాయం చేస్తా. రైతులను రాజుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉన్నాము. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్నాము.

Also Read..YSRCP MPS : ఎంపీగా నై.. ఎమ్మెల్యేగా సై.. వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఎమ్మెల్యేగా పోటీకి ఎంపీల ఆసక్తి.. ఎవరా ఎంపీలు? కారణాలేంటి? 10టీవీ Exclusive Report

మొత్తం మీ పేరు చెప్పి రాష్ట్రాన్ని దోచుకుంటుంటే మనం ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాం. రాష్ట్రంలో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు జగన్ తయారయ్యాడు. ఇలాంటి దుర్మార్గుడు రాష్ట్రంలో లేకుండా చేసే బాధ్యత మీది. మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత నాది. కొత్త తుంగపాడులో కొండల కొండలు కరిగిపోయాయి. భూమి కొనాలన్నా భూమి అమ్మాలన్నా వీళ్ళ పర్మిషన్ కావాలి. రాష్ట్రమంతా జె టాక్స్ ఇక్కడ జక్కంపూడి టాక్స్. కాటవరం కొండలను మింగేశారు. మరోపక్క గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్. రాష్ట్రంలో గంజాయి లేని ప్రాంతం లేదు. గంజాయి అలవాటు చాలా ప్రమాదం” అని చంద్రబాబు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు