TDP : ఎన్టీఆర్ ఫ్యామిలీకి టీడీపీ పగ్గాలు అప్పగించడం మంచిది

చంద్రబాబును ప్రజలెవరూ నమ్మరని, ఆ విషయం తాజా ఎన్నికల ఫలితాలతో మరోసారి స్పష్టమైంది. బాబు మళ్లీ గెలిచే పరిస్థితి లేదు. అందుకనే తెలుగుదేశం పార్టీనీ..

TDP : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టే ప్రజల మద్దతు తమకు ఉందన్నారు.

తమ ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్ద పీట వేశామని, చంద్రబాబులా దౌర్జన్యాలు చేయలేదని అన్నారు. చంద్రబాబును ప్రజలెవరూ నమ్మరని, ఆ విషయం తాజా ఎన్నికల ఫలితాలతో మరోసారి స్పష్టమైందని చెప్పారు. బాబు మళ్లీ గెలిచే పరిస్థితి లేదని ఆయన జోస్యం చెప్పారు. అందుకనే తెలుగుదేశం పార్టీనీ చంద్రబాబు ఎన్టీఆర్‌ కుటుంబానికి అప్పగిస్తే ఉత్తమమని నారాయణ స్వామి సూచించారు.

Accident : ఘోరం… ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

”కుప్పం ప్రజలకు, ఓటర్లకు తలవంచి నమస్కారం చేస్తున్నా. కుప్పంలో 80 శాతం ఉన్న బీసీలను చంద్రబాబు ఇంతకాలం మభ్యపెట్టారు. ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా కుప్పం ఓటర్లు నమ్మలేదు. జగన్ పథకాలకు కుప్పం ప్రజలు ఓట్లు వేశారు. పెద్దిరెడ్డి ఓటర్లను ప్రేమగా ఓట్లు అడిగితే చంద్రబాబు తిడుతూ ఓట్లు అడిగారు. మేం జగనన్న పథకాలు అందాయా అని ఓటర్లను అడిగాం. పేదలకు సేవ చేసే కార్యక్రమాలు జగన్ చేశారు. చంద్రబాబు 45 వేల దొంగ ఓట్లతో ఇంతకాలం గెలుస్తూ వచ్చాడు. దొంగ ఓట్ల సంప్రదాయం చంద్రబాబుది.

Read More..Pollution : ఫైవ్ స్టార్ హోటల్స్‌‌లో ఉంటూ రైతులపై విమర్శలా ? కాలుష్యంపై జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్

ఒక్క చోట కూడా టీడీపీ ఏజెంట్లు దొంగ ఓట్లు అని ఎవ్వరినీ అడ్డుకోలేదు. కుప్పంలో ఇక చంద్రబాబు గెలవలేరు. ఇక వేరే నియోజకవర్గం చూసుకోవాలి. ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ద్రోహానికే ఈ రోజు దెబ్బతింటున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి టీడీపీ పగ్గాలను అప్పగించడం మంచిది. లోకేష్ ను వారసునిగా చేయాలని చంద్రబాబు తపన పడుతున్నాడు. లోకేష్ బాబును తల్లిదండ్రులు ఎలా పెంచారో కానీ… పెద్దలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గతంలో సోనీయా గాంధీ, నరేంద్రమోదీలను తిట్టాడు. వాళ్లతోనే కలుస్తాడు. చంద్రబాబుకి ఒక స్టాండ్ లేదు” అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు