Chittoor Rains : ఇంటి నుంచి బయటకు రావొద్దు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలు, వరదలు జిల్లాను వణికిస్తున్నాయి.

Chittoor Rains : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలు, వరదలు జిల్లాను వణికిస్తున్నాయి. జిల్లాకు ఇవాళ, రేపు భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే చెరువులు, డ్యామ్ లు పూర్తిగా నిండాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

మాధవ నగర్, గొల్లవానిగుంట, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జిల కింద భారీగా వర్షపు నీరు చేరింది. అటు కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Paytm CEO : నెలకు రూ.10వేల జీతమని.. నాకు పిల్లను ఇవ్వనన్నారు : విజయ్ శేఖర్ శర్మ

వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండడంతో చిత్తూరు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హరినారాయణన్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ ఈ ఆదేశాలు తప్పక పాటించాలని కలెక్టర్ సూచించారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా జిల్లాకు తీసుకొచ్చినట్టు వివరించారు.

Kamakshi Plant : కాలేయ వ్యాధుల నుండి కాపాడే కామాక్షి మొక్క

ఈ ఏడాది జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని కలెక్టర్ తెలిపారు. నదులు, వాగులు, నీటి ప్రవాహాలను దాటొద్దని సూచించారు. రేపు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. మరోవైపు ఆధ్యాత్మిక నగరం తిరుపతి భారీ వర్షాలతో జలమయం అయ్యింది. వెస్ట్ చర్చి దగ్గర ప్రమాదకర స్థాయికి నీటి ప్రవాహం చేరడంతో అధికారులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు.

ట్రెండింగ్ వార్తలు