Nara Lokesh : కొంత మంది మీడియా మిత్రులతో రోజు చిట్ చాట్ చేస్తున్నా ఎక్కడికి పారిపోలేదు : లోకేష్

తాను తప్పు చేసి ఉంటే చంద్రబాబే తనను మొదట అరెస్ట్ చేసి ఉండేవారని లోకేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులతో తనకు సంబంధం లేదన్నారు.

Nara Lokesh

Nara Lokesh Sensational Comments : నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ప్రకటించిన ఆస్తులు, భూముల కన్నా ఎక్కువ ఉంటే అవన్నీ ప్రభుత్వానికి రాసిస్తామని తెలిపారు. ప్రతి ఏడాది తాము తమ ఆస్తులను ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. తమ ఆస్తులన్ని తమ పేర్లపైనే ఉంటాయని.. జగన్ ఆస్తుల్లాగా సంస్థల పేర్లతో ఉండవని వెల్లడించారు. తాము తప్పు చేసి ఉంటే తమ బ్యాంకు ఖాతాలకు డబ్బులు వచ్చి ఉండేవన్నారు.

తాను తప్పు చేసి ఉంటే చంద్రబాబే తనను మొదట అరెస్ట్ చేసి ఉండేవారని లోకేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులతో తనకు సంబంధం లేదన్నారు. సీఐడీ వైసీపీ సంస్థలా పని చేస్తుందని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. అక్టోబర్ 4న సీఐడీ విచారణకు హాజరవుతానని జగన్ లా తాను వాయిదాలు తీసుకోనని స్పష్టం చేశారు.

Nara Lokesh : టీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు

అన్ని చదివే సీఐడీ నోటీసులకు సంతకం పెట్టానని తెలిపారు. కొంత మంది మీడియా మిత్రులతో రోజు చిట్ చాట్ చేస్తున్నానని ఎక్కడికి పారిపోలేదన్నారు. హెరిటేజ్ భూములు 9 ఎకరాలు అమరావతి రాజధాని నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని పేర్కొన్నారు.

నేషనల్ హైవేకి 2 కిలో మీటర్ల దూరంలో ప్లాంట్ పెట్టాలని హెరిటేజ్ ఆ భూమిని తీసుకుందని చెప్పారు. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక హెరిటేజ్ బాధ్యతల నుంచి తప్పుకున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం హెరిటేజ్ లో తాను షేర్ హోల్డర్ ని మాత్రమేనని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు