Balakrishna : చంద్రబాబుని అనారోగ్యం పాలు చేసేందుకు కుట్రలు, ఏమైనా జరిగితే జగన్‌దే బాధ్యత- ఎమ్మెల్యే బాలకృష్ణ

చంద్రబాబు ఏమీ జగన్ రెడ్డిలా అవినీతి చేసి జైలు కెళ్లలేదు. జగన్ రెడ్డిలా ముద్దాయి కాదు. Balakrishna

Balakrishna Warns CM Jagan (Photo : Google)

Balakrishna Warns CM Jagan : రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుని అనారోగ్యం పాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకి ఏమైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యత అన్నారు బాలకృష్ణ.

ఇంకా జగన్ పగ చల్లారినట్లు లేదు..
”అభివృద్ధిలో చంద్రబాబుని ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసినా జగన్ పగ చల్లారినట్టు లేదు. చంద్రబాబుని ప్రజల నుంచి దూరం చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కుట్రలు చేస్తున్నారు. 73 ఏళ్ల చంద్రబాబు ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకి 34 రోజులుగా జైల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆయన్ను అనారోగ్యం పాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి.

Also Read : జైలులో చంద్రబాబుకు ఏసీ పెట్టటానికి అదేమన్నా అత్తారిల్లా..? : సజ్జల సెటైర్లు

జగన్ రెడ్డిలా అవినీతి చేసి జైలు కెళ్లలేదు..
డాక్టర్ల పేరుతో జైలు సూపరింటెండెంట్ హెల్త్ రిపోర్ట్ ఇవ్వడం జగన్ రెడ్డి కుటిల రాజకీయంలో భాగం కాదా? ఒక తెల్ల కాగితంపై మీ ఇష్టమొచ్చినట్టు రాసుకుని సంతకం పెట్టే అథారిటీ జైలు అధికారికి ఎవరిచ్చారు? సొంత పార్టీ ఎంపీ రఘురామరాజును శారీరకంగా హింసించి దొంగ రిపోర్టులు ఇచ్చినట్టే చంద్రబాబు విషయంలో చేస్తున్నారు. చంద్రబాబు ఏమీ జగన్ రెడ్డిలా అవినీతి చేసి జైలు కెళ్లలేదు. జగన్ రెడ్డిలా ముద్దాయి కాదు. జైల్లో పెట్టేశాం. మా ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే కుదరదు.

కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం..
చంద్రబాబు వ్యక్తిగత సిబ్బందితో వైద్యం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారు? చంద్రబాబు నెల రోజుల్లో 5 కేజీల బరువు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. మరో 2 కేజీలు బరువు తగ్గితే ఆ ప్రభావం కిడ్నీలపై పడే అవకాశం ఉంది. విరిగిన ఎముకలు ఎక్స్ రేలో కనిపించకుండా మ్యానేజ్ చేసే ఘనులకు జగన్ రెడ్డి దగ్గర కొదవే లేదు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రజల్లో ఎమోషన్స్ రాకుండా ఉండటం కోసం ఎంతకు దిగజారేందుకైనా జగన్ రెడ్డి సిద్ధం. తక్షణమే చంద్రబాబు వ్యక్తిగత వైద్యులను అనుమతించాలి. ఎయిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలి. చంద్రబాబుకి ఏమైనా జరిగితే జగన్ రెడ్డిదే బాధ్యత” అని హెచ్చరించారు బాలకృష్ణ.

Also Read : చంద్రబాబు కేసులు.. మరోసారి విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ట్రెండింగ్ వార్తలు