Kishan Reddy : మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే విధానం ఇది కాదు.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన కిషన్ రెడ్డి

కవితకు ఈడీ నోటీసులు వచ్చిన విషయం తనకు తెలియదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కాబట్టి తెలంగాణ బీజేపీకి ఏం సంబంధమని పేర్కొన్నారు.

Kishan-Reddy

Kishan Reddy – Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే విధానం ఇది కాదన్నారు. ఆయనకు నోటీసు ఇచ్చి సంప్రదించిన తర్వాత అరెస్టు చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా సరే కక్షపూరిత రాజకీయాలు మంచిది కాదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పద్ధతి ప్రకారం డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేశామని తెలిపారు.

తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడించారు. టీ.బీజేపీ ఎలాంటి అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదన్నారు. అభ్యర్థుల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకున్నామని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక సెంట్రల్ బీజేపీ తీసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమకు ఎటువంటి పొత్తులు లేవని స్పష్టం చేశారు.

Bandi Sanjay : చంద్రబాబు అరెస్ట్ పై మరోసారి స్పందించిన బండి సంజయ్.. అప్పుడే అరెస్ట్ చేయాలా అంటూ ఫైర్

కవితకు ఈడీ నోటీసులు వచ్చిన విషయం తనకు తెలియదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కాబట్టి తెలంగాణ బీజేపీకి ఏం సంబంధమని పేర్కొన్నారు. జనసేన, టీడీపీ పొత్తుల గురించి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు మాట్లాడతారని తెలిపారు.

కాంగ్రెస్ సభను తాము అడ్డుకుంటున్నామన్నది తప్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజుకో సభ పెట్టుకున్నా తమకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడే ఉండి ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టుకున్నా తమకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు