MLC Election Results 2023: ఏపీ ప్రజల్లో తిరుగుబాటుకు నిదర్శనం..ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఆధిక్యం : ఎమ్మెల్యే బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్ లోని పట్టభద్రులు(గ్రాడ్యుయేట్‌), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ హవా కొనసాగిస్తోంది. దీంతో టీడీపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇది వైసీపీ ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు..ఇక టీడీపీ విజయదుంధి షురూ అయ్యింది అయ్యిందంటూ హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హర్షం వ్యక్తంచేశారు.

MLC Election Results 2023: ఆంధ్రప్రదేశ్ లోని పట్టభద్రులు(గ్రాడ్యుయేట్‌), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ హవా కొనసాగిస్తోంది. దీంతో టీడీపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇది వైసీపీ ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు..ఇక టీడీపీ విజయదుంధి షురూ అయ్యింది అంటూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ దూసుకుపోవటంపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ట మాట్లాడుతూ..ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఈ ఎన్నికలే నిదర్శనమి..టీడీపీపై ప్రజలకు గౌరవమే కాకుండా నమ్మకం కూడా ఉందని దీనికి ఈ పట్టభద్రుల ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే నిదర్శనమయ్యారు. ఇక టీడీపీ విజదుంధుబి మొదలైంది అంటూ ఆనందం వ్యక్తంచేవారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసిన గ్రాడ్యుయేట్లు టీడీపీవైపే మొగ్గుచూపారని అన్నారు.

మరో టీడీపీ నేతల అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యం అని ముఖ్యంగా ఉత్తరాంధ్రాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం దిశగా సాగిపోతోందని ఈ ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు జగన్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టేలా ఉన్నాయని అన్నారు. ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయారని దానికి ఈ ఎన్నికలు ఉదాహరణగా కనిపిస్తున్నాయన్నారు. ప్రజలు తిరగబడితే ఫలితం ఎలా ఉంటుందో జగన్ కు ప్రత్యక్షంగా కనిపిస్తోందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మాపక్షానే నిలిచారని అన్నారు. అభివృతద్ధే తమ నినాదమని ఉత్తరాంధ్రప్రజలు చాటిచెప్పారని..అభివృద్ధి టీడీపీతోనే సాద్యమని నమ్మారని అన్నారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తంచేశారు.

ట్రెండింగ్ వార్తలు