MP Gorantla Madhav : చంద్రబాబు నిజాయతీ పరుడని చెప్పేందుకు ఎవరైనా చర్చకు వస్తారా? ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్

చంద్రబాబు ఏం చేసినా చట్టపరిధిలోకిరాదన్న ఆలోచన మానుకోవాలని, ఐపీసీ రాసేటప్పుడు చంద్రబాబుకు వర్తించదని రాయలేదని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.

MP Gorantla Madhav

YCP MP Gorantla Madhav : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును శనివారం ఉదయం సీఐడీ పోలీసులు నంద్యాల వద్ద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళనకు దిగారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు అరెస్ట్ సబబే అంటూ పేర్కొంటున్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎలా నేరస్థుడవుతారో చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. ఆయన నిజాయతీ పరుడని చెప్పేందుకు ఎవరైనా చర్చకు రావచ్చు అంటూ సవాల్ విసిరారు.

Chandrababu Arrest : రేపే చంద్రబాబు, భువనేశ్వరిలో పెళ్లి రోజు .. ఈరోజే అరెస్ట్
నూరు గొడ్లతిన్న రాబందు.. ఒక్క గాలివానకు చచ్చినట్టు చంద్రబాబు దొరికారని అన్నారు.ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ముసుగులో దోపిడీలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. సీఐడీ వారు ఆయన ముసుగు తీసి దొంగ అని తేల్చారని మాధవ్ అన్నారు. మొరుగుతున్న గుంట నక్కలు ఒక్కటి తెలుసుకోవాలి. 2017లోనే దర్యాప్తు సంస్థలు ఈ కేసులో దోపిడీని తేల్చారు. ఆ తరువాతే సీఐడీ రంగంలోకి దిగి పూర్తి అధ్యయనం చేసిందని అన్నారు.

Chandrababu Arrest: ఉండవల్లిలో తన నివాసానికి చేరుకున్న నారా లోకేశ్.. పోలీసులు ఏం చేశారంటే..

చంద్రబాబు ఏం చేసినా చట్టపరిధిలోకిరాదన్న ఆలోచన మానుకోవాలని, ఐపీసీ రాసేటప్పుడు చంద్రబాబుకు వర్తించదని రాయలేదని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు చేసిన అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని, చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు