Pawan Kalyan: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి పవన్ కళ్యాణ్ పరామర్శ

అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరలోనే ఉంటున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వద్దకు వెళ్లిన పవన్ ఆమెను పరామర్శించారు. ఈ సమయంలో బాలకృష్ణ, నారా లోకేశ్, నారా బ్రాహ్మిణి ఉన్నారు.

Pawan Kalyan

JanaSena Chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భవనేశ్వరిని పరామర్శించారు. స్కిల్ డవలప్‌మెంట్ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుతో గురువారం పవన్ కల్యాణ్ బాలకృష్ణ, నారా లోకేశ్ తో కలిసి ములాఖత్ అయ్యారు. జైలులో వీరు ముగ్గురు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో పలు అంశాలపై చర్చించారు.

జైలు బయటకు వచ్చిన తరువాత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ముందుకెళ్తాయని, రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని పవన్ స్పష్టం చేశారు. రేపటి నుంచి జనసేన, తెదేపా కలిసి పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

Pawan Kalyan: జైల్లో చంద్రబాబు భద్రత విషయంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఇవాళ్లి ములాఖత్ ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది. చంద్రబాబు పాలనపై విధానపరమైన అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. కానీ చంద్రబాబు గురించి వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదని పవన్ అన్నారు. అయితే, జైలులో చంద్రబాబు భద్రతపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడారు. చంద్రబాబు భద్రత విషయంపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరలోనే ఉంటున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వద్దకు వెళ్లిన పవన్ ఆమెను పరామర్శించారు. ఈ సమయంలో బాలకృష్ణ, నారా లోకేశ్, నారా బ్రాహ్మిణి ఉన్నారు.

Also Read: పూర్తిగా ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తర్వాత ఏం జరగబోతోంది?

ట్రెండింగ్ వార్తలు