Pawan Kalyan On PetrolPrices : దేశంలో ఏపీలోనే పెట్రో ధరలపై పన్నులు ఎక్కువ, తగ్గించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పెట్రో ధరలపై పన్నులు ఎక్కువ. రాష్ట్రంలో కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Pawan Kalyan On PetrolPrices : పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించడం హర్షనీయం అన్నారు పవన్. ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిందన్నారు. కేంద్రం ప్రకటనతో అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలకు సాంత్వన చేకూరిందన్నారు. అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పెట్రో ధరలపై పన్నులు ఎక్కువ అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్.

”పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని భావిస్తున్నా. పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మనసారా ఆహ్వానిస్తున్నా. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం హర్షనీయం. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రేట్లే కారణం అన్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం నిర్ణయంతో నిత్యావసర వస్తువుల ధరలు కొంతవరకు తగ్గే అవకాశం ఉండటం అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలకు కొంత స్వాంతన కలిగిస్తుందని భావిస్తున్నా.(Pawan Kalyan On PetrolPrices)

Petrol Price : వాహనదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?

అలాగే ప్రధాని ఉజ్వల పథకం లబ్దిదారులకు అందించే గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గించడం పేదవారికి ఆర్థికంగా మేలు చేకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం బాటనే ఏపీ ప్రభుత్వం కూడా అనుసరించాలని కోరుతున్నా. ఇంధన ధరలపై స్థానిక పన్నులు అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే అధికంగా ఉన్నాయి. అసలే అస్తవ్యస్థమైపోయి ధ్వంసమైన రోడ్లతో ఏపీ ప్రజలు ప్రయాణం భారంగా మారి వాహనాలు మరమ్మతులకు లోనై అల్లాడిపోతున్నారు.

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రోడ్ సెస్ పేరుతో ప్రజల నుంచి ఏటా రూ.600 కోట్లు వస్తూలు చేస్తోంది. అయినా రోడ్లను బాగు చేసే పరిస్థితి ఎలాగూ కనిపించడం లేదు. కనీసం పెట్రోల్, డీజిల్ పై స్థానిక పన్నులను తగ్గించి ఊరట కలిగించాలని ప్రజలు చేస్తున్న డిమాండ్ ను వైసీపీ సర్కార్ నేరవేర్చాలని కోరుతున్నా” అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

కాగా.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్య ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం భారీగా తగ్గించింది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. తద్వారా లీటర్ పెట్రోల్ పై రూ.9.50, లీటర్ డీజీల్ పై రూ.7 మేర తగ్గింది.

Minister Harish Rao : పెట్రోల్ పై పెంచింది బారాణా..తగ్గించింది చారాణా : మంత్రి హరీష్ రావు

దేశంలో గత కొన్నాళ్లుగా పెట్రో ధరలు పైపైకి దూసుకెళ్లడం తెలిసిందే. పెట్రోల్ లీటర్ రూ.120 వరకు ఉండగా, డీజిల్ లీటర్ రూ.105 వరకు పలుకుతోంది. ఇటీవల మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 మధ్య కాలంలో పెట్రో ధరలను 14 సార్లు పెంచారు. తద్వారా లీటర్ పై గరిష్ఠంగా రూ.10 వరకు పెరిగింది. తాజాగా ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు భారీ ఊరట కలిగింది.

ట్రెండింగ్ వార్తలు