Aadi Saikumar : దగ్గరుండి మ్యూజిక్ డైరెక్టర్‌తో.. గోవాలో వర్క్ చేయించుకుంటున్న హీరో..

‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ అయిపోగా ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.

Aadi Saikumar : గతంలో క్యూట్ లవ్ స్టోరీ సినిమాలతో మెప్పించిన లవ్ లీ హీరో ఆది సాయి కుమార్ నుంచి ఇటీవల వచ్చిన సినిమాలు ఆశించినంత ఫలితం రాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఫిక్స్ అయిపోయాడు. గతంలో తనకు చుట్టలబ్బాయ్‌ లాంటి హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ వీరభద్రమ్ చౌదరితో ఇటీవల ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

విలేజ్ డ్రామాతో పాటు లవ్, కామెడీ ఉంటూనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ సినిమా రాబోతుంది. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ పై తూము నరసింహా, జామి శ్రీనివాసరావు నిర్మాతలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక ఈ సినిమాలో దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read : Deviyani Sharma : నా ఫోన్ హ్యాక్ అయింది.. ఇప్పటికే మానసికంగా చాలా బాధపడుతున్నా.. ఆవేదనతో నటి పోస్ట్..

అయితే ఆల్రెడీ ఈ ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ అయిపోగా ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని తన హిట్ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ని ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకున్నారు ఆది. దీంతో అనూప్ తో ఆది, దర్శకుడు వీరభద్రమ్ దగ్గరుండి కూర్చొని మ్యూజిక్ ప్లాన్ చేయించుకుంటున్నారు.

ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ ని ప్రశాంతంగా గోవాలో సముద్రపు ఒడ్డున పెట్టుకోవడం గమనార్హం. గోవా నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ ఫోటోని దర్శకుడు వీరభద్రమ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇక ఈ ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి జరగనుంది. హిట్ కాంబోతో పనిచేస్తున్న ఆది ఈసారి ఎలాగైనా హిట్ కొడతాడని భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు