Sanju Samson : ఎవ‌రైనా అంపైర్‌తో వాగ్వాదం చేస్తే.. శిక్ష ఇలాగే ఉంటుంది.. సంజూకు బీసీసీఐ షాక్‌

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయిం

Sanju Samson fined : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. మంగ‌ళ‌వారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 20 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌వి చూసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగులు చేసింది.

ల‌క్ష్య ఛేద‌న‌లో రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ (86 46 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్స‌ర్లు) అద్భుతంగా పోరాడాడు. అయితే అత‌డు వివాదాస్ప‌ద నిర్ణ‌యంతో ఔట్ కావ‌డం, మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఆర్ఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 201 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. కాగా.. ఓట‌మి బాధ‌లో ఉన్న సంజూ శాంస‌న్‌కు బీసీసీఐ షాకిచ్చింది. అంపైర్‌తో వాగ్వాదం చేసినందుకు గాను ఐపీఎల్ అడ్వైజ‌రీ క‌మిటీ సంజూకు భారీ జ‌రిమానా విధించింది. అత‌డి మ్యాచ్ ఫీజులో 30 ఫైన్‌గా వేసింది.

IPL 2024 : వివాదంగా మారిన సంజు శాంసన్ ఔట్.. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్న మాజీ క్రికెటర్లు.. అసలేం జరిగిందంటే?

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్‌ను ఉల్లంఘించాడు. ఆర్టిక‌ల్ 2.8 లెవ‌ల్ 1 నేరానికి పాల్ప‌డిన‌ట్లు తేలింది. మ్యాచ్ రిఫ‌రీ అత‌డికి మ్యాచ్ ఫీజులో 30 శాతం జ‌రిమానా విధించారు అని ఐపీఎల్ అడ్వైజ‌రీ క‌మిటీ ఓ ప్ర‌క‌న‌ట‌లో తెలిపింది.

ఏం జ‌రిగింది..

రాజ‌స్థాన్ ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్‌ను ముకేశ్ కుమార్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని నాలుగో బంతిని లాండ్ దిశ‌గా సంజూ శాంస‌న్ భారీ షాట్ ఆడాడు. అయితే.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న షై హోప్ క్యాచ్ అందుకున్నాడు. కాగా.. అత‌డు క్యాచ్ ను అందుకున్న స‌మ‌యంలో హోప్ ఎడ‌మ కాలు బౌండ‌రీ లైన్‌ను తాకిన‌ట్లుగా రిప్లేలో క‌నిపించింది. కాలుకి, బౌండ‌రీ లైన్‌కు మ‌ధ్య ఖాళీ క‌నిపించ‌లేదు.

Wasim Akram : విరాట్ కోహ్లి స్ట్రైక్‌రేటు పై పాక్ దిగ్గ‌జ ఆట‌గాడు వ‌సీం అక్ర‌మ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కానీ.. రిప్లే ప‌రిశీలించాక థ‌ర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణ‌యంతో సంతృప్తి చెంద‌ని శాంస‌న్ అంపైర్‌తో వాద‌న‌కు దిగిన‌ప్ప‌టికి ఫ‌లితం లేక‌పోయింది. ఈ కార‌ణంగానే సంజూకు మ్యాచ్ ఫీజులో కోత ప‌డింది.

ట్రెండింగ్ వార్తలు