Wasim Akram : విరాట్ కోహ్లి స్ట్రైక్‌రేటు పై పాక్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 17వ సీజన్‌లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు.

Pakistani legend Wasim Akram reacts to Virat Kohli strike rate chatter
Wasim Akram – Virat Kohli : ఐపీఎల్ 17వ సీజన్‌లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటి వరకు అతడు 11 ఇన్నింగ్స్‌ల్లో 148 స్ట్రైక్‌రేటుతో 542 పరుగులు చేసి లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడు పరుగులు చేస్తున్నప్పటికి కొన్ని మ్యాచుల్లో అతడి స్ట్రైక్‌రేటుపై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సహా కొందరు మాజీ క్రికెటర్లు కోహ్లి స్ట్రైక్‌రేటు పై విమర్శలు చేస్తుండగా తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీ20 క్రికెట్‌లో నెమ్మదిగా ఆడే రోజులు పోయాయన్నాడు. తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయాలని అక్రమ్ చెప్పుకొచ్చాడు. ఆర్‌సీబీ ఓడిపోతుండడంతోనే కోహ్లి స్ట్రైక్‌రేటు చర్చనీయాంశంగా మారిందని అభిప్రాయపడ్డాడు. జట్టు గెలిస్తే 100, 150 స్ట్రైక్ రేటుతో ఆడినా ఎవరూ పట్టించుకోరన్నాడు. అయితే.. ఓడిపోతే మాత్రం దాన్ని భూతద్దంలో చూపిస్తూ విమర్శలు గుప్పిస్తారని మండిపడ్డాడు.
Team India new Jersey : కొత్త జెర్సీతో టీ20ప్రపంచకప్ బరిలోకి భారత్.. ఎలా ఉందో కాస్త చెప్పరూ?
ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా కోహ్లి తీవ్ర ఒత్తడికి గురైయ్యాడు. ఇప్పుడు కూడా దాదాపుగా అలాంటి ఒత్తిడినే ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. అతడు పరుగులు చేస్తున్నాడు. అయితే మిగిలిన వాళ్లు రాణించడం లేదు. ఒక్కడే మ్యాచులు గెలిపించలేడు కదా. కోహ్లిని విమర్శించడం సరికాదు. ఇది అస్సలు అమోదయోగ్యం కాదు అని అక్రమ్ అన్నాడు.
చిన్నస్వామి స్టేడియం చిన్నగా ఉందని చాలా మంది అంటున్నారు. ఆ స్టేడియం చిన్నదనే విషయం అందరికి ముందే తెలుసు. 1987లో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పటి నుంచి ఆ స్టేడియం అలాగే ఉంది. ఎలాంటి మార్పులు లేవు. ఆ గ్రౌండ్‌కు తగ్గట్లుగా ప్లేయర్లను తీసుకోవాలని అక్రమ్ సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20ల్లో యాంకర్ రోల్‌కు చోటు లేదు. ఆడిన మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది అని అక్రమ్ తెలిపాడు.