Deviyani Sharma : నా ఫోన్ హ్యాక్ అయింది.. ఇప్పటికే మానసికంగా చాలా బాధపడుతున్నా.. ఆవేదనతో నటి పోస్ట్..

తాజాగా దేవియని శర్మ తన ఫోన్ హ్యాక్ అయిందంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

Deviyani Sharma : ఇటీవల సైబర్ నేరాలు బాగా ఎక్కువయ్యాయి. సెలబ్రిటీలు సైతం ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తాజాగా ఓ నటి ఫోన్ హ్యాక్ అయిందంటూ పోస్ట్ చేసింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన దేవియని శర్మ ఇటీవల షైతాన్, సేవ్ ది టైగర్స్ సిరీస్ లతో మెప్పించి ఫుల్ పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోషూట్స్ తో అలరిస్తుంది.

Also Read : Brahma Anandam : తాత మనవళ్లుగా రాబోతున్న తండ్రీకొడుకులు.. ‘బ్రహ్మా ఆనందం’..

తాజాగా దేవియని శర్మ తన ఫోన్ హ్యాక్ అయిందంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దేవియని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. కొన్ని రోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయింది. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేశారు, భయపెట్టాలని చూశారు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకు తెలీదు కానీ ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నా. ఇప్పుడు మళ్ళీ నా ఫోన్ లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. నా వాట్సాప్ హ్యాక్ అయిందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ నా నంబర్ నుచి ఎవరికైనా ఎలాంటి మెసేజ్ వచ్చినా అది నాది కాదు. ఇప్పటికే దీంతో మానసికంగా బాధపడుతున్నాను. మూడు సార్లు ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేను వ్యవస్థలను నమ్ముతాను. కేసుని ముందుకు తీసుకెళ్తాను. కాబట్టి నా నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ లు వచ్చినా అది నేను కాదు అని తెలుసుకోండి. వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఇది నా పరువు తీయడానికి, నన్ను చెడుగా ప్రమోట్ చేయడానికే చేస్తున్నట్టు ఉంది. మామూలుగానే ఒక ఆర్టిస్ట్ జీవితం చాలా కష్టంగా అంటుంది. ఇలాంటి వాటితో మరింత కష్టంగా మారుతుంది అంటూ ఆవేదనతో పోస్ట్ చేసింది. దీంతో దేవియని పోస్ట్ వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు