Govt Employees Strike : సమ్మెకు వెళితే చర్యలు.. భయపడేది లేదన్న ఉద్యోగ సంఘాలు

నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి స్పందించారు...

Sajjala Ramakrishna Reddy : ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి వెళితే.. నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి స్పందించారు. ప్రభుత్వం తీసుకొనే చర్యలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. దీంతో పీఆర్సీ వివాదం మరింత ముదిరినట్లైంది. 2022, జనవరి 24వ తేదీ సోమవారం పీఆర్సీపై ప్రభుత్వ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ…ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచినా రాలేదని, వారితో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

Read More : Andhra Pradesh PRC : పీఆర్సీ పిటిషన్.. నిర్ణయం తీసుకొనే అధికారం తమకు లేదు

కమిటీతో చర్చించేందుకు ఉద్యోగులు ముందుకు రావాలని మరోసారి సూచించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీతో చెప్పుకోవచ్చని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కమిటీని గుర్తించమని చెప్పడం ప్రతిష్టంభనను పెంచడమేనన్నారు. సమస్యను జఠిలం చేయొద్దని, సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. పీఆర్సీపై మంగళవారం కూడా ప్రభుత్వ కమిటీ భేటీ అవుతుందని తెలిపిన సజ్జల ఈ భేటీకైనా ఉద్యోగ సంఘాల నేతలు హాజరు కావాలని మరోసారి సూచించారు. సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం తీసుకొనే చర్యలకు భయపడేది లేదని, ఈనెలకు పాత జీతాలు ఇస్తామని చెబితేనే చర్చలపై ఆలోచిస్తామన్నారు.

Read More : Yoga : యోగాకు ముందు…తరువాత… పాటించాల్సిన ఆహారనియమాలు

మరోవైపు సమ్మె నోటీసు ఇవ్వడానికి ఏపీ ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. జీఏడీ కార్యాలయంలో సీఎస్ కు స్టీరింగ్ కమిటీ సభ్యులు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. కానీ..సీఎస్ అందుబాటులో లేరని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇంకోవైపు కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు దాఖలైన పిటిషన్‌పై విచారణ సమయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ విచారించే రోస్టర్ లో తమ బెంచ్ లేదని న్యాయస్థానం పేర్కొంది.

Read More : TTD News: జనవరి 27 నుంచి అందుబాటులోకి టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు

ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వ్యక్తిగత పిటిషన్ అవటంతో దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని వ్యాఖ్యానించింది. ఉద్యోగుల జీతాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే జీతాల్లో కోత విధించారని పిటిషనర్ వాదించారు. దీంతో జీతాలు ఎంత తగ్గాయో చెప్పాలంటూ హైకోర్టు ఉద్యోగులను ప్రశ్నించింది. సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని ఎలా బెదిరిస్తారంటూ ఏజీ హైకోర్టులో వాదించారు.

ట్రెండింగ్ వార్తలు