Sidharth Luthra : చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత, సీఐడీ కస్టడీకి అనుమతి తర్వాత.. సిద్ధార్ధ లూథ్రా మరో ఆసక్తికర ట్వీట్

క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయడం, టీడీపీ అధినేతను సీఐడీ కస్టడీ కోరడం, అందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడం.. Sidharth Luthra

Sidharth Luthra Tweet (Photo : Google)

Sidharth Luthra Tweet : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా చేస్తున్న ట్వీట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రతీ రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. ఉదయం వెలుగుని తెస్తుంది అంటూ ట్వీట్ చేశారు లూథ్రా. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయడం, టీడీపీ అధినేతను సీఐడీ కస్టడీ కోరడం, అందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడం.. ఈ పరిణామాల తర్వాత సిద్ధార్ధ లూథ్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Also Read..Chandrababu Interrogation : సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. కస్టడీలో సీఐడీ వేసే ప్రశ్నలు ఏంటి, ఏయే అంశాలపై ప్రశ్నిస్తారు.. విచారణ ఎలా ఉండబోతోంది?

గతంలోనూ లూథ్రా ఇలాంటి ట్వీటే చేశారు. ప్రపంచంలో తమకు ఎదరవుతున్న అవమానాలు, అపహాస్యాన్ని పట్టించుకోకుండా ఒక మనిషి తన విధులను తాను నిర్వర్తించాలని స్వామి వివేకానంద కొటేషన్స్ ను లూథ్రా ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా గురుగోవింద్ కింగ్ వ్యాఖ్యలను కోట్ చేశారాయన. అన్ని విధాలుగా ప్రయత్నించినా న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అంటూ అర్థం వచ్చే కొటేషన్ ను ట్యాగ్ చేశారు లూథ్రా.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
కాగా.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ”కేసు అత్యంత కీలక దశలో ఉంది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేము. సుమారు 140 మంది సాక్షులను సీఐడీ విచారించింది. ఇంత చేశాక ఇప్పుడు విచారణ ఆపమనడం సరికాదు. దర్యాఫ్తు సంస్థకు స్వేచ్ఛ ఇవ్వాలి” అని తీర్పులో వెల్లడించింది.

Also Read..Nara Lokesh: అసలు నారా లోకేశ్ హస్తినకు ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం చేస్తున్నారు?

వాట్ నెక్ట్స్.. చంద్రబాబు ఏం చేయనున్నారు?
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి ఒకేరోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అటు 2 రోజుల సీఐడీ కస్టడీకి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరినా.. కోర్టు 2 రోజుల కస్టడీకే పర్మిషన్ ఇచ్చింది. దీంతో టీడీపీ శ్రేణులు షాక్ కి గురయ్యాయి. టీడీపీ నేతలు నెక్ట్స్ ఏం చేయనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. శని, ఆదివారాల నేపథ్యంలో సోమవారం(సెప్టెంబర్ 25) సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా.. హైకోర్టులో డివిజన్ బెంచ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఏసీబీ కోర్టులో బెయిల్ కు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ కూడా ఉంది.

ట్రెండింగ్ వార్తలు