Tuni Train Burning Case : తుని రైలు దహనం కేసు.. ఏడేళ్ల తర్వాత కోర్టు కీలక తీర్పు

Tuni Train Burning Case : 2016లో తుని రైలు దహనం ఘటన జరిగింది. ఈ కేసులో కాపు నేత ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజాతో మొత్తం 41మందిని రైల్వే పోలీసులు నిందితులుగా చేర్చారు.

Tuni Train Burning Case : తుని రైలు దహనం కేసులో విజయవాడ రైల్వే కోర్టు తీర్పు వెల్లడించింది. ఏడేళ్ల విచారణ తర్వాత కేసు కొట్టివేస్తూ విజయవాడ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది. 2016లో తుని రైలు దహనం ఘటన జరిగింది. ఈ కేసులో కాపు నేత ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజాతో మొత్తం 41మందిని రైల్వే పోలీసులు నిందితులుగా చేర్చారు.

2016 జనవరి 30న కాపు నాడు సభ జరిగింది. అదే సమయంలో రైలు దగ్ధమైంది. అయితే, ఈ కేసులో సరైన సాక్ష్యాలు చూపించలేదంటూ ఏడేళ్ల తర్వాత కేసుని కొట్టి వేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

కోర్టు తీర్పు ఇస్తున్న సమయంలో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవా కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. ఈ ముగ్గురు సహా 41 మంది రైలు దహనం కేసులో నిందితులుగా ఉన్నారు. కోర్టు తీర్పుతో ఈ ముగ్గురికి క్లీన్ చిట్ లభించింది. తీర్పు సందర్భంగా విజయవాడ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి సరైన వాదనలు లేకపోవడంతో, సాక్ష్యాలు చూపించకపోవడంతో కేసును కొట్టి వేస్తున్నట్లు చెప్పింది.(Tuni Train Burning Case)

Also Read..AP Politics: సైలెంట్ అయ్యారు..! చంద్రబాబు, పవన్ భేటీ.. ఏపీ బీజేపీలో మారుతున్న సమీకరణాలు..

కాగా, తుని రైలు దగ్ధం కేసులో ముగ్గురు రైల్వే పోలీసు అధికారులు దర్యాప్తును సరిగ్గా చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్ల పాటు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించింది. ఐదేళ్ల పాటు కోర్టులో ఎక్కువ మంది సాక్షులను ప్రవేశ పెట్టలేదంది. ఆ రైలులో అంతమంది ప్రయాణిస్తుంటే ఎక్కువ మందిని విచారించలేదని అభిప్రాయపడింది. మొత్తంగా ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో 41 మందిపై అక్రమ కేసుగా పరిగణించి, కొట్టి వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.

తీర్పు సందర్భంగా విజయవాడ రైల్వే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైల్వే పోలీసుల తీరుపై సీరియస్ అయ్యింది. ”దర్యాప్తు ప్రక్రియలో, నేరం రుజువు చేయడంలో రైల్వే పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ కేసుకి సంబంధించిన ఆధారాలను రైల్వే పోలీసులు కోర్టు ముందు ఉంచలేకపోయారు. ఆ ముగ్గురు రైల్వే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చెప్పాలని” ను కోర్టు నిలదీసింది. అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

ఇకపోతే పోలీసు విభాగం, రైల్వే పోలీసులు నమోదు చేసిన పలు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎత్తి వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆర్పీఎఫ్ కేసు పెండింగ్ లో ఉంది. ఇప్పుడు రైల్వే కోర్టు కూడా దాన్ని కూడా కొట్టేసింది.

Also Read..Rajinikanth : YCP నాయకులపై ఫైర్ అవుతున్న తలైవా ఫ్యాన్స్.. ట్రెండింగ్ లో #YSRCPApologizeRajini

టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో పెద్ద ఎత్తున కాపు కులస్తులు ఉద్యమించారు. ఈ క్రమంలోనే కాపు రిజర్వేషన్ల సాధన కోసం 2016 జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా తునిలో సభ నిర్వహించారు. ఆ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌‌కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రైలు పూర్తిగా దహనమైంది.

 

ట్రెండింగ్ వార్తలు