Chandra Babu Naidu Birthday : చంద్రబాబుకు బర్త్‪డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి..!!

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ వైసీపీ ఎంపీ చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

Chandra Babu Naidu Birthday : ఏప్రిల్ 20 టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు. నేడు 73 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు చంద్రబాబు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న క్రమంలో చంద్రబాబుకు టీడీపీ నేతలే కాదు.. వైసీపీ కీలక నేతలు కూడా బాబుకు విషెష్ చెబుతున్నారు. దీంట్లో భాగంగా ఎప్పుడు చంద్రబాబుపై మండిపడుతు పరుషపదజాలంతో విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ శుభాకాంక్షలు చెప్పారు.

అలాగే వైసీపీ మరో నేత..సినిమా ప్రొడ్యూసర్ పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) కూడా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతు..’సమాజానికి సేవ చేసే ప్రతి నాయకుడు కలకాలం వర్ధిల్లాలి. తెలుగు జాతికి మంచి పనులు చేయడానికి మరింత శక్తిని, ఉత్సాహన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ’ అంటూ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

నిన్న మొన్నటి వరకు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేయడంలో ముందుండే విజయసాయి రెడ్డి. తాజాగా దానికి భిన్నంగా ట్విట్ చేస్తు బాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పటంలో అంతర్యం ఏమిటాని తెలుగు తమ్ముళ్లు యోచిస్తున్నారు. సందర్భం ఏదైనా.. సెటైర్లు వేనే విజయం సాయి చంద్రబాబుకు గతంలో బర్తే డే విషెస్ చెప్పినా కాని.. కాస్త వెటకారంగానే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం దానికి పూర్తి భిన్నంగా బాబుపై ప్రేమ కురిపిస్తున్నట్లుగా బాబు దీర్ఘాయుష్షుతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అనటం ఆసక్తికరంగా మారింది.

కాగా..నందమూరి కుటుంబంలో తారకరత్న మరణం సందర్భంగా చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఇద్దరు కలిసి ఉన్న ఫోటో అప్పట్లో వైరల్ గా మారింది. తారకరత్న భార్యకు విజయసాయిరెడ్డి దగ్గర బంధువు. అలాగే నందమూరి అల్లుడు చంద్రబాబు. తారకరత్న మరణించిన సమయంలో అనుకోకుండా చంద్రబాబు, విజయసాయి రెడ్డిలు కలుసుకున్నారు. పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. కాగా..ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి వార్తల్లో వినిపించటంలేదు కనిపించటంలేదు. తాజాగా ఎప్పుడు లేనిది చంద్రబాబుకు ప్రేమ కురిపిస్తు విజయసాయి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పటం ఆసక్తికరంగా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు