Chandrababu Naidu : ఒక్క వాలంటీర్‌ను కూడా వదిలిపెట్టను- చంద్రబాబు సీరియస్ వార్నింగ్

వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. Nara Chandrababu Naidu

Chandrababu Warning(Photo : Twitter)

Chandrababu Naidu – Pulivendula : జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్ల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపాయి. వాలంటీర్ల కారణంగా ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడిందని, వారి డేటా క్రిమినల్స్ కు చేరుతోందని పవన్ ఆరోపించారు. రాష్ట్రంలో వేలాది సంఖ్యలో బాలికలు, మహిళల అదృశ్యం అవడానికి వాలంటీర్ వ్యవస్థ కారణం అని పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణకి కారణం వాలంటీర్​ వ్యవస్థే అని పవన్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ చేసిన ఈ అలిగేషన్స్ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ కు తోడయ్యారు. వాలంటీర్ వ్యవస్థ గురించి పులివెందులలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. వాలంటీర్లు ఒంటరి మహిళ వివరాలను సేకరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను పీడించే ఏ వాలంటీర్ ను కూడా వదిలిపెట్టను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.

Also Read..Avanthi Srinivas: భీమిలిలో అవంతి శ్రీనివాస్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవా.. సీటు మారుస్తారా?

ఇక, ఎమ్మెల్సీగా ఎన్నికైన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని అభినందించారు చంద్రబాబు. వై నాట్ పులివెందుల అని చంద్రబాబు నినదించారు. బీటెక్ రవిని పులివెందులలో గెలిపించాలని ఓటర్లను కోరారు చంద్రబాబు. పులివెందులలో తెలుగుదేశం జెండా ఎగరాలి, ఇది నా చిరకాల వాంఛ అని చంద్రబాబు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు