Yarlagadda Venkatarao : చంద్రబాబుతో భేటీ కానున్న యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో చేరనున్న యార్లగడ్డ

అయితే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ గోప్యత పాటిస్తోంది. చంద్రబాబును వెంకట్రావు గతంలోనే కలిశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Yarlagadda Venkatarao meet Chandrababu

Yarlagadda Venkatarao – Chandrababu : గన్నవరం పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు చంద్రబాబు అపాయింట్ మెంట్ ఖరారు అయింది. దీంతో యార్లగడ్డ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆగస్టు22వ తేదీన గన్నవరం సభలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

అయితే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ గోప్యత పాటిస్తోంది. చంద్రబాబును వెంకట్రావు గతంలోనే కలిశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆదివారం భేటీలో గన్నవరంలో గెలుపే లక్ష్యంగా ఎలా పని చేయాలనే అంశంపై యార్లగడ్డకు చంద్రబాబు దిశానిర్ధేశం చేయనున్నారు.

Vijayawada : వైసీపీలో చేరిన టీడీపీ శ్రేణులు.. పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి వెలంపల్లి

కాగా, ఇప్పటికే వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్ బై చెప్పారు. మరోవైపు విజయవాడలో టీడీపీకి షాక్ తగిలింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి తెలుగు తమ్ముళ్ళు షాక్ ఇచ్చారు. పలువురు కార్యకర్తలు టీడీపీని వీడారు.

టీడీపీ శ్రేణులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ శ్రేణులకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకముందు చిట్టినగర్ నుంచి భారీ మోటారు ర్యాలీ నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు