YCP MLA : మర్మాంగాలు కోసేయాలి, అప్పుడే భయం వస్తుంది

మహిళలపై మానభంగాలకు పాల్పడే వారిని శిక్షిస్తే సరిపోదని... నడిరోడ్డుపై మర్మాంగాలు కోసి, కాళ్లు చేతులు నరికేస్తేనే వారిలో భయం వస్తుందని వైసీపీ..

YCP MLA : 0మహిళలపై మానభంగాలకు పాల్పడే వారిని శిక్షిస్తే సరిపోదని… నడిరోడ్డుపై మర్మాంగాలు కోసి, కాళ్లు చేతులు నరికేస్తేనే వారిలో భయం వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలంలో ఆసరా పథకం రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

Prakash Raj : భోరున ఏడ్చిన బెనర్జీ.. మా అమ్మను తిట్టారంటూ తనీష్ భావోద్వేగం..

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆయన వాపోయారు. ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై తిరగాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి ఉందన్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడే మానవ మృగాలను పక్క దేశాల్లో నడిరోడ్డుపై ఉరితీస్తారని, భారత్‌లోనూ అలాంటి కఠిన చట్టాలు ఎందుకు తీసుకురారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేసే చట్టాలు రావాలని, అప్పుడే మృగాళ్లలో భయం ఏర్పడుతుందని అన్నారు.

Prakash Raj: ‘MAA’కు మూకుమ్మడి రాజీనామా.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం

మహిళల రక్షణ కోసం చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందన్న ఎమ్మెల్యే నల్లపరెడ్డి చట్టాల్లో మార్పు కోసం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాయనున్నట్టు చెప్పారు. కాగా, సీఎం జగన్‌ తీసుకొచ్చిన దిశ చట్టం ద్వారా కొంతవరకు మహిళలకు న్యాయం జరుగుతోందన్నారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి.

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట చిన్న పిల్లలు, యువతులు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్ల రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో మహిళలకు రక్షణ కల్పించే విధంగా, వారిపై చెయ్యి వేయాలంటేనే భయం పుట్టేలా చట్టాలను మరింత కఠినతరం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు