2023 Hyundai Creta : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ తయారీదారు హ్యుందాయ్ 2023 (Hyundai Creta N Line) నైట్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. బ్రెజిల్‌లో ఈ కొత్త లాంచ్ చేసింది. కొత్త హ్యుందాయ్ క్రెటా 2023లో భారత మార్కెట్లో ఇంకా లాంచ్ కాలేదు. 2023 హ్యుందాయ్ క్రెటా N లైన్ నైట్ ఎడిషన్‌లో డార్క్ యాక్సెంట్‌లు, LED DRLలతో LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.
2023 Hyundai Creta Launch : 2023 Hyundai Creta N Line Night Edition Launched
అంతేకాదు.. డార్క్ ఎలిమెంట్‌లతో LED టైల్‌ల్యాంప్‌లు, స్పెషల్ 18-అంగుళాల N లైన్ గ్లోస్ బ్లాక్ అల్లాయ్‌లు అందించారు. ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ డిజిటల్ డిస్‌ప్లే ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ నైట్ ఎడిషన్ ఫీచర్లు కొనుగోలుదారులను సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి.
2023 Hyundai Creta N Line Night Edition Launched
ప్రస్తుతానికి భారత మార్కెట్లో హ్యుందాయ్ ప్రవేశపెట్టలేదు. అతి త్వరలోనే భారత్‌లోనూ క్రెటా ఎన్ లైన్ నైడ్ ఎడిషన్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్. SUV బోస్ 8-స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్‌ను కూడా పొందవచ్చు.
2023 Hyundai Creta N Line Night Edition Launched
2023 హ్యుందాయ్ క్రెటా (N) లైన్ నైట్ ఎడిషన్ హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌తో వస్తుంది. బ్లాక్ కలర్‌లో అదిరిపోయే డిజైన్‌తో చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే.. క్రెటా వినియోగదారులను మరింత చేరువయ్యేలా ఫీచర్లను డిజైన్ చేసింది.
2023 Hyundai Creta N Line Night Edition Launched
అటానమస్ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫెటీగ్ డిటెక్టర్, అడాప్టివ్ హై బీమ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. సెక్యూరిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. 2023 హ్యుందాయ్ క్రెటా N లైన్ నైట్ ఎడిషన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్ ఫ్రంట్/రియర్ పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.
2023 Hyundai Creta N Line Night Edition Launched
2023 హ్యుందాయ్ క్రెటా N లైన్ నైట్ ఎడిషన్ 2.0-లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ ఇంజన్‌ను డ్యూయల్ CVVTతో వచ్చింది. ఈ ఫ్లెక్స్ ఇంధనంతో రన్ అయ్యే మోటార్ 167hp గరిష్ట శక్తిని 202Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. బ్రెజిల్‌లో 2023 హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ నైట్ ఎడిషన్ ధర సుమారుగా రూ. 28.83 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.