Akasa Air : Akasa Air : ఆకాశ ఎయిర్ ప్రతీ వారం 900 విమాన సర్వీసులు

ఆకాశ ఎయిర్ ఈ ఏడాది డిసెంబరు నాటికి అంతర్జాతీయ మార్గాల్లో ప్రతీ వారం 900 విమాన సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. వారానికి 900 విమానాలతో 4.3 మిలియన్ల మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరవేసిందని అకాసా ఎయిర్ తెలిపింది....

Akasa Air

Akasa Air : ఆకాశ ఎయిర్ ఈ ఏడాది డిసెంబరు నాటికి అంతర్జాతీయ మార్గాల్లో ప్రతీ వారం 900 విమాన సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. వారానికి 900 విమానాలతో 4.3 మిలియన్ల మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరవేసిందని అకాసా ఎయిర్ తెలిపింది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో అంతర్జాతీయంగా ప్రయాణించేందుకు అర్హత సాధించింది. (Akasa Air Eligible For International Routes)

Balochistan Blast : పాకిస్థాన్‌లో పేలుడు…ఏడుగురి మృతి

అకాసా ఎయిర్ గత సంవత్సరం ఆగస్ట్ 7వతేదీన ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు తన తొలి విమానంతో కార్యకలాపాలను ప్రారంభించింది. (Operates 900 Flights Every Week) ఈ ఏడాది డిసెంబరు నాటికి అంతర్జాతీయ రూట్లలో విమానాలు నడిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అకాసా ఇప్పటికే ప్రకటించింది. ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని జెట్ ఎయిర్‌వేస్ మాజీ సీఈఓ వినయ్ దూబే, ఇతరులతో కలిసి ఎయిర్ ఆకాసాను స్థాపించింది.

Dhabas : దాబాల్లో వ్యభిచారం…ఐదుగురు మహిళల అరెస్ట్

వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో అకాసా ఎయిర్ 4.9 శాతం మార్కెట్ వాటాతో 4.3 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించింది. 16 గమ్యస్థానాలలో 35 ప్రత్యేక మార్గాల్లో వారానికి 900కు పైగా విమానాలను నడిపే మైలురాయిని అధిగమించిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమయంలో తమ నెట్‌వర్క్‌లో 25,000 టన్నుల కార్గోను తీసుకువెళ్లినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అకాసా ఎయిర్ 76 బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ లు, 53 హై-కెపాసిటీ బి 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ఆర్డర్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు