Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

Apple iPhone 14 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఆపిల్ (iPhone 14 Plus)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 128GB స్టోరేజ్‌తో బేస్ మోడల్‌ ధర రూ. 89,900 నుంచి ప్రారంభమవుతుంది.

Apple iPhone 14 Plus Discount on Flipkart : ప్రపంచ ఐకానిక్ దిగ్గజం ఆపిల్ (Apple) సొంత బ్రాండ్ ఐఫోన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆపిల్ ఐఫోన్ 14 Plus మోడల్‌పై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 మాదిరిగానే ఫీచర్లను కలిగి ఉంది. కానీ, పెద్ద డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీతో ఉంటుంది. భారత మార్కెట్లో ఆపిల్iPhone 14 Plus ధర 128GB స్టోరేజ్‌తో బేస్ మోడల్‌కు రూ. 89,900 నుంచి ప్రారంభమవుతుంది.

256GB, 512GB స్టోరేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ఇతర వేరియంట్‌ల ధరలు వరుసగా రూ.99,900 రూ.1,19,900 నుంచి అందుబాటులో ఉన్నాయి. అయితే, ఐఫోన్ 14 ప్లస్ రూ. 45,901 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 43,999కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ప్లస్ బ్లూ, పర్పుల్, మిడ్‌నైట్, స్టార్‌లైట్, రెడ్ అనే ఐదు కలర్ ఆప్షన్లలోఅందుబాటులో ఉంది. ఆపిల్ ఐఫోన్ 14 Plus గత ఏడాదిలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ‘Plus మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఆపిల్ ఐఫోన్ 8 సిరీస్‌తో ప్లస్ మోడల్‌ను ఆపిల్ నిలిపివేసింది.

Read Also : Oppo F23 5G Launch : ఇది కదా ఫోన్ అంటే.. ఒప్పో F23 5G ఇదిగో.. దిమ్మతిరిగే ఫీచర్లు, మే 18 నుంచే సేల్..!

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 8,901 తగ్గింపు పొందింది. తద్వారా ఈ ఐఫోన్ ధర రూ. 80,999కి సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14 Plus ధర రూ.76,999కి తగ్గింది. కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ. 33వేల వరకు తగ్గింపును పొందవచ్చు. అన్ని ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కొనుగోలుదారులు ఐఫోన్ 14 ప్లస్‌ను కేవలం రూ.43,999కి పొందవచ్చు.

Apple iPhone 14 Plus at Rs 43,999 in Flipkart sale

ఆపిల్ ఐఫోన్ 14 Plus మోడల్ 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 13 Pro మోడల్‌లలో కనిపించే విధంగా స్మార్ట్‌ఫోన్ మెరుగైన A15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. ఆపిల్ iPhone 14 Plus 12MP ప్రధాన సెన్సార్, అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 14 Plus 5G సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. స్మార్ట్‌ఫోన్ 26 గంటల వరకు ఉంటుందని ఆపిల్ పేర్కొంది. కొత్త క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌కు కూడా సపోర్టు చేస్తుంది.

Read Also : iPhone 12 mini Offer : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. రూ.20,999లకే సొంతం చేసుకోండి.. అద్భుతమైన ఆఫర్.. డోంట్ మిస్..!

ట్రెండింగ్ వార్తలు