Disney Plus Hotstar Limit : నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. ఈ కొత్త పాలసీతో యూజర్ల అకౌంట్ షేరింగ్‌పై లిమిట్..!

Disney Plus Hotstar Limit : భారత్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం యూజర్ల కోసం అనుమతించే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. తద్వారా పాస్‌వర్డ్ షేరింగ్ లిమిట్ చేయనుంది. పాస్‌వర్డ్ షేరింగ్ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో నెట్‌ఫ్లిక్స్ ఇదే విధానాన్ని అమలు చేసింది.

Disney Plus Hotstar Limit : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) బాటలో మరో స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పయనిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే పాస్‌వర్డ్ షేరింగ్‌ను యూజర్లకు కష్టతరం చేస్తోంది. నివేదికల ప్రకారం.. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం యూజర్లకు పాస్‌వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రీమియం యూజర్లు కేవలం 4 డివైజ్‌ల నుంచి మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతించే కొత్త విధానాన్ని అమలు చేయాలని కంపెనీ యోచిస్తోందని నివేదిక పేర్కొంది. ఈ చర్యతో పాస్‌వర్డ్ షేరింగ్ సమస్యను పరిష్కరించనుంది.

రాయిటర్స్ ప్రకారం.. డిస్నీ నెట్‌ఫ్లిక్స్ బాటలో వెళ్తోంది. మేలో, డిస్నీ స్ట్రీమింగ్ పోటీదారు, నెట్‌ఫ్లిక్స్, ఇప్పటికే 100 కన్నా ఎక్కువ దేశాలలో ఇదే విధానాన్ని అమలు చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఇంటి వెలుపలి వ్యక్తులతో సర్వీసును షేర్ చేయడానికి అదనపు పేమెంట్ అవసరమని చందాదారులకు తెలియజేసింది. ప్రస్తుతం, భారత మార్కెట్లో ప్రీమియం డిస్నీ+ హాట్‌స్టార్ అకౌంట్ వెబ్‌సైట్ 4 లిమిట్ పేర్కొన్నప్పటికీ.. గరిష్టంగా 10 డివైజ్‌లలో లాగిన్‌లను అనుమతిస్తుంది. అయితే, కంపెనీ ఇంటర్నల్ పాలసీ అమలును టెస్టింగ్ చేసింది. ఈ ఏడాది చివరిలో అమలు చేయాలని భావిస్తోంది. ప్రీమియం అకౌంట్ల కోసం గరిష్టంగా 4 డివైజ్‌లకు లాగిన్‌లను పరిమితం చేయనుంది.

Read Also : Hotstar Plans: సెప్టెంబర్ 1 నుంచి అప్‌గ్రేడ్ అయ్యే Disney+Hotstar ప్లాన్లు ఇవే!

కొత్త పరిమితులు అమల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది యూజర్లు తమ సొంత సభ్యత్వాలను కొనుగోలు చేయనుందని నివేదిక వెల్లడించింది. డిస్నీ ప్రారంభంలో 4-డివైజ్ లాగిన్ విధానం ద్వారా పాస్‌వర్డ్ షేరింగ్‌కు అనుమతించింది. అంతేకాదు.. వ్యక్తిగత అకౌంట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించుకునే సబ్‌స్ర్కైబర్లను ఆకర్షించవచ్చని భావించింది. డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియో సినిమా భారత్‌లో విపరీతమైన పాపులర్ అయ్యాయి. మీడియా పార్టనర్స్ ఆసియా ప్రకారం.. భారత స్ట్రీమింగ్ మార్కెట్ 2027 నాటికి 7 బిలియన్ డాలర్ల పరిశ్రమగా వృద్ధి చెందనుందని అంచనా.

Disney Plus Hotstar to limit account sharing in India after Netflix

దాదాపు 50 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగిన యూజర్ల పరంగా హాట్‌స్టార్ మార్కెట్ లీడర్ అని ఇండస్ట్రీ డేటా సూచిస్తుంది. భారత్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం యూజర్ల కోసం 4 డివైజ్ లాగిన్ విధానాన్ని అమలు చేయనుందని పేర్కొంది. అదనంగా, ఇంటర్నల్ రీసెర్చ్ ప్రకారం.. కేవలం 5శాతం ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు 4 కన్నా ఎక్కువ డివైజ్‌ల నుంచి లాగిన్ అయినట్లు చూపించాయి. అయితే, రాబోయే కొత్త మార్పులతో లిమిట్ చౌకైన ప్లాన్‌కు కూడా వర్తిస్తుంది. వినియోగాన్ని కేవలం 2 డివైజ్‌లకుమాత్రమే పరిమితం చేస్తుంది.

జనవరి 2022, మార్చి 2023 మధ్య భారత స్ట్రీమింగ్ మార్కెట్‌లో డిస్నీ హాట్‌స్టార్ 38శాతం వీక్షకులను ఆక్రమించిందని పరిశోధనా సంస్థ మీడియా పార్ట్‌నర్స్ ఆసియా నుంచి వచ్చిన డేటా వెల్లడించింది. పోటీదారులు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఒక్కొక్కటి 5శాతం కలిగి ఉన్నాయి. జాయింట్ వెంచర్ పార్టనర్ కనుగొనేందుకు లేదా వ్యాపారాన్ని విక్రయించే అవకాశాన్ని అన్వేషించడానికి కంపెనీ చర్చల్లో నిమగ్నమైంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న స్ట్రీమింగ్ మార్కెట్‌ విస్తరించే దిశగా డిస్నీ ప్రయత్నాలను చేపట్టింది.

Read Also : Airtel Jio 5G Services : దేశంలో 8వేలకు పైగా నగరాల్లో ఎయిర్‌టెల్, జియో 5G సర్వీసులు.. 5G యాక్టివేట్ చేసుకోవడం ఎలా? ఏయే ప్లాన్లు ఉన్నాయంటే?

ట్రెండింగ్ వార్తలు