Elon Musk: మళ్లీ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకిన ఎలాన్ మస్క్.. ఆ దెబ్బతో రెండో స్థానంలోకి అర్నాల్ట్

ఒకే రోజులో ఎల్‭వీఎమ్‭హెచ్ 11 బిలియన్ డాలర్లు నష్టపోయిందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. డిసెంబర్ 2022లో ప్రపంచంలో మస్క్ కంపెనీ టెస్లా విలువ బాగా పడిపోవడంతో లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ మాతృ సంస్థ అయిన ఎల్‭వీఎమ్‭హెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్నాల్ట్ అత్యంత ధనవంతుడిగా మొదటిసారి రికార్డుకెక్కారు

Richest Person: ప్రపంచ కుబేరుల స్థానంలో టెస్లా అధినేత ఎలాన్ మరోసారి నెంబర్ స్థానానికి ఎగబాకారు. వాస్తవానికి మస్క్ తన సంపపాదనలో పెద్ద మెరుగుదల ఏమీ చూపించలేదు కానీ, మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ అర్నాల్న్ సంపాదన తగ్గడంతో ఆయన వెనక్కి వెళ్లి మస్క్ ముందుకు వచ్చారు. అర్నాల్ట్‭కు చెందిన లగ్జరీ వస్తువుల తయారీ కంపెనీ ఎల్‭వీఎమ్‭హెచ్ షేర్లు తాజాగా 2.6 శాతం పడిపోయాయి. బ్లూంబర్గ్ నివేదించిన ప్రకారం.. పారిస్ ట్రేడింగులో బుధవారం ఇది నమోదైంది. దీంతో ఎల్‭వీఎమ్‭హెచ్ మార్కెట్ వాల్యూ 10 శాతం కుంచించుకుపోయింది.

Gyanvapi Masjid Dispute : జ్ఞాన్ వాపి మసీదు వివాదం.. అంజుమన్ మసీదు కమిటీ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఒకే రోజులో ఎల్‭వీఎమ్‭హెచ్ 11 బిలియన్ డాలర్లు నష్టపోయిందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. డిసెంబర్ 2022లో ప్రపంచంలో మస్క్ కంపెనీ టెస్లా విలువ బాగా పడిపోవడంతో లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ మాతృ సంస్థ అయిన ఎల్‭వీఎమ్‭హెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్నాల్ట్ అత్యంత ధనవంతుడిగా మొదటిసారి రికార్డుకెక్కారు. ఆ సమయంలో మస్క్ నికర విలువ 200 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కారణం అప్పుడు మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ కొనుగోలు చేసి, అందులోనే నిమగ్నమయ్యారు.

Karnataka Politics: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన సునీల్ కనుగోలుకు భారీ బహుమతే ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య

అయితే మస్క్ ఈ సంవత్సరం 55.3 బిలియన్ డాలర్లకు పైగా లాభాలతో పుంజుకున్నారు. అలాగే టెస్లా సైతం 66 శాతం పుంజుకుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద ప్రస్తుతం 192.3 బిలియన్ డాలర్లు కాగా, ఆర్నాల్ట్ సంపద 186.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక టెస్లాతో పాటు స్పేస్‌ఎక్స్ పేరుతో రాకెట్ కంపెనీని న్యూరాలింక్‌లకు కూడా నిర్వహిస్తున్నారు. న్యూరాలింక్ మానవ మెదడును కంప్యూటర్‌లకు కనెక్ట్ చేయడానికి అల్ట్రా-హై బ్యాండ్‌విడ్త్ బ్రెయిన్-మెషిన్ ఇంటర్‌ఫేస్‌లను అభివృద్ధి చేసే స్టార్ట్-అప్.

ట్రెండింగ్ వార్తలు