Hero Karizma XMR : కొత్త బైక్ కొంటున్నారా? అక్టోబర్ 1 నుంచి పెరగనున్న హీరో కరిజ్మా XMR బైక్ ధర.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

Hero Karizma XMR : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. వచ్చే నెల (అక్టోబర్ 1) నుంచి హీరో కరిజ్మా XMR ధర భారీగా పెరగనుంది.

Hero Karizma XMR to cost Rs 7,000 more from October 1

Hero Karizma XMR : ప్రముఖ హీరో మోటోకార్ప్ కంపెనీ హీరో కరిజ్మా (XMR) బైక్ కొనేందుకు చూస్తున్నారా? అయితే వెంటనే బుకింగ్ చేసుకోండి. లేదంటే మరికొద్దిరోజుల్లో ఈ బైక్ ధర భారీగా పెరగనుంది. అంటే.. అక్టోబరు 1 నుంచి హీరో కరిజ్మా XMR బైక్ ధర రూ. 7వేలు పెంచనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ (Hero Karizma XMR Launch) అయిన ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 1,72,900 (ఎక్స్-షోరూమ్) ఉండగా.. రూ. 1,79,900 (ఎక్స్-షోరూమ్) వరకు పెరగనుంది. కొత్త కరిజ్మా XMR రూ. 1 లక్ష 72 వేల 900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర (రూ. 3వేలు)తో బుకింగ్‌లు సెప్టెంబర్ 30 అర్ధరాత్రి వరకు ఓపెన్ అయి ఉంటాయి. కొత్త బుకింగ్ విండో కోసం కంపెనీ తర్వాత తేదీని ప్రకటించనుంది. అయితే, అది కొత్తగా సవరించిన ధరతో ఉంటుంది.

Read Also : Hero Karizma XMR 210 : బైక్ అంటే ఇలా ఉండాలి భయ్యా.. లెజెండ్ కొత్త అవతార్‌లో 2023 హీరో కరిజ్మా XMR 210 బైక్ రీఎంట్రీ.. ధర ఎంతో తెలుసా?

హీరో Karizma XMR బైక్ ఆగష్టు 29న లాంచ్ అయింది. 210cc, 4V, DOHC, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ కలిగి ఉంది. హీరో మోటోకార్ప్‌కు ఈ బైక్ మొదటిది. పవర్, టార్క్ ఫిగర్‌లు రెండూ వరుసగా 25.5PS, 20.4Nm వద్ద క్లాస్-లీడింగ్‌లో ఉన్నాయి. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

హీరో కరిజ్మా స్పెషిఫికేషన్లు ఇవే :
కొత్త కరిజ్మా XMR డైనమిక్ ఏరో-లేయర్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ సెగ్మెంట్-ఫస్ట్ అడ్జస్టబుల్ విండ్‌షీల్డ్‌ను పొందుతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్ LCD యూనిట్. మోటార్‌సైకిల్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది.

Hero Karizma XMR to cost Rs 7,000 more from October 1

ఇందులో, సెగ్మెంట్-ఫస్ట్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంది. మోటారుసైకిల్ ఇతర ముఖ్యమైన ఫీచర్లలో తేలికైన క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, స్లిప్, అసిస్ట్ క్లచ్, సిక్స్-స్టెప్ మోనోషాక్, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి. అంతేకాదు.. ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్, మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. హీరో కరిజ్మా XMR బజాజ్ పల్సర్ RS200, సుజుకి Gixxer SF 250 యమహా R15 V4లకు పోటీదారుగా మార్కెట్లోకి వచ్చింది.

Read Also : TVS Apache RTR 310 Launch : కొత్త బైక్ కొంటున్నారా? టీవీఎస్ అపాచీ RTR 310 బైక్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. బుకింగ్స్ ఓపెన్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు