Google Pixel 9 Series : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ కొత్త ఫోన్లలో ఎమర్జెన్సీ ఫీచర్ తీసుకొచ్చింది. టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్లకు పోటీగా గూగుల్ కూడా ఈ SOS శాటిలైట్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇటీవలే కొత్త పిక్సెల్ 9 సిరీస్‌ను గూగుల్ గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ పిక్సెల్ 9 ఫోన్లలో సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌ను అందించింది. కొత్త శాటిలైట్ ఎస్ఓఎస్ ఫంక్షన్ ఫీచర్ అందించిన ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ అవతరించింది.
Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డీల్.. ధర ఎంత తగ్గిందంటే? మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!
ఇప్పటివరకూ ఒక్క ఆపిల్ ఐఫోన్లలో మాత్రమే ఈ SOS ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు సెల్యులార్ లేదా వై-ఫై నెట్‌వర్క్‌లు అందుబాటులో లేనప్పుడు ఎమర్జెన్సీ సేవలను పొందవచ్చు. వారి లొకేషన్ షేర్ చేయడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది. పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌తో సహా పిక్సెల్ 9 ఫోన్లలో మొదటగా అమెరికాలో మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
శాటిలైట్ ఎస్ఓఎస్ ఎలా పనిచేస్తుందంటే? :
అవసరమైన అన్ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, శాటిలైట్ నెట్‌వర్క్ రిజిస్ట్రేషన్‌లు పూర్తయిన తర్వాత శాటిలైట్ ఎస్ఓఎస్ ఫీచర్ పిక్సెల్ 9 ఫోన్‌లలో ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. SOS సర్వీసును ప్రత్యక్షంగా ఉన్నప్పుడు వినియోగదారులు నోటిఫికేషన్‌ను స్వీకరిస్తారు. సెల్యులార్ లేదా వై-ఫై కవరేజ్ లేని అత్యవసర పరిస్థితుల కోసం ఈ ఫీచర్ రూపొందించింది. వినియోగదారులు తమ పిక్సెల్ 9 ఫోన్‌లో 911కి డయల్ చేసినప్పుడు నెట్‌వర్క్ అందుబాటులో లేనప్పుడు ఫోన్ వారిని శాటిలైట్ ఎస్ఓఎస్ ఉపయోగించమని ప్రాంప్ట్ అడుగుతుంది.
శాటిలైట్ ఎస్ఓఎస్ ఆప్షన్ నొక్కిన తర్వాత వినియోగదారులు స్క్రీన్‌పై పరిస్థితిని వివరిస్తూ ఎమర్జెన్సీ క్వశ్చనరీని పూర్తి చేయాలి. తమ లొకేషన్, ఎమర్జెన్సీ వివరాలను షేర్ చేయడం ద్వారా లేదా ఈ ఫీచర్ నుంచి వైదొలగడం ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు తెలియజేసేలా ఎంచుకోవచ్చు. వినియోగదారులు తమ ఫోన్‌ను శాటిలైట్ కనెక్షన్ కోసం సరిగ్గా ఉంచడానికి ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను ఫాలో చేయాలి. యూజర్ లొకేషన్, పరిసర పరిస్థితులపై ఆధారపడి కనెక్షన్, రెస్పాన్స్ టైమ్ మారవచ్చు. కనెక్ట్ అయినప్పుడు అత్యవసర సేవలను పొందాలంటే వినియోగదారులు టెక్స్ట్ మెసేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు.
ఫీచర్ ఎవరికి పరిమితమంటే? :
పిక్సెల్ 9 ఫోన్లలో మొదటి 2 ఏళ్లు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా శాటిలైట్ ఎస్ఓఎస్ ఫీచర్ అందిస్తోంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం హవాయి, అలాస్కా మినహా అమెరికాకు మాత్రమే పరిమితం అయింది. ఇతర ప్రాంతాలకు లేదా డివైజ్‌లకు సర్వీసును విస్తరించే ప్రణాళికలను గూగుల్ ఇంకా ప్రకటించలేదు. పిక్సెల్ 9 సిరీస్‌లో శాటిలైట్ ఎస్ఓఎస్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఆపిల్ అందించే ఫీచర్ మాదిరిగానే ఈ లైఫ్-సేవింగ్ టెక్నాలజీని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం అందిస్తుంది. నెట్‌వర్క్ కవరేజీ లేని అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులకు భద్రతను అందించడమే గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.