Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ అత్యంత ఖరీదైన ప్లాన్ ఇదే.. సింగిల్ రీఛార్జ్‌తో 365 రోజులు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.. ధర ఎంతంటే?
Airtel Recharge Plan : ఎయిర్ టెల్ యూజర్లకు కోసం అత్యంత ఖరీదైన ప్లాన్ అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 365 రోజులు పాటు ఎంజాయ్ చేయొచ్చు.

Airtel Cheapest Plan
Airtel Recharge Plan : దేశంలోని రెండో అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రిలయన్స్ జియో తర్వాత అత్యధిక సంఖ్యలో మొబైల్ వినియోగదారులను కలిగి ఉంది. ఎయిర్‌టెల్ (Airtel Recharge Plan) ప్రస్తుతం తమ యూజర్ల కోసం అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఇందులో తక్కువ ధర నుంచి ఖరీదైన ధర వరకు అనేక రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి.
ఎయిర్‌టెల్ అన్ని రకాల వినియోగదారుల కోసం అన్ని రకాల రీఛార్జ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. మీరు కూడా ఎయిర్‌టెల్ యూజర్ అయితే ఇది మీకోసమే. ఎయిర్‌టెల్ అందించే అత్యంత ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లలో రూ. 3999 ప్లాన్ ఒకటి. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా కలిగే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఎయిర్‌టెల్ రూ.3999 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.3999 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దాదాపు ఒక ఏడాది వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, రోజుకు 2.5GB డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా ఈ ప్లాన్‌లో పొందవచ్చు.
ఎయిర్‌టెల్ ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు ఏడాది పొడవునా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. అన్ లిమిటెడ్ 5G డేటా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. దీర్ఘకాలిక వ్యాలిడిటీ కోసం అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ పొందవచ్చు.
Read Also : SWP Investment : రిటైర్మెంట్ కు ముందే SWPలో ఇలా పెట్టుబడి పెట్టండి.. ఫింఛను పాలసీల కన్నా అధిక రాబడి..!
ప్రీపెయిడ్ ప్లాన్ ఫీచర్లు :
వ్యాలిడిటీ : 365 రోజులు.
డేటా : రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా. అన్ లిమిటెడ్ 5G డేటా
వాయిస్ : అన్ లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ కాల్స్.
ఎస్ఎంఎస్ : రోజుకు 100 SMS.
అదనపు బెనిఫిట్స్ :
OTT : ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే.
మ్యూజిక్ : వింక్ మ్యూజిక్, ఫ్రీ హెలోట్యూన్స్ .
హెల్త్ : అపోలో 24/7 సర్కిల్ సభ్యత్వం.
బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వివరాలివే :
ఎయిర్‌టెల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు కోసం రూ. 3,999 నెలవారీ ప్లాన్ కూడా అందిస్తుంది.
ఎయిర్‌టెల్ ఫైబర్ ఇన్ఫినిటీ ప్లాన్ (రూ. 3,999/నెలకు)
స్పీడ్ : 1Gbps వరకు.
డేటా : అన్ లిమిటెడ్ డేటా
ఓటీటీ : ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు సబ్‌స్క్రిప్షన్