Samsung Galaxy S25 FE : వారెవ్వా.. ఈ 5 కొత్త ఫోన్లు కేక.. శాంసంగ్ గెలాక్సీ S25 FE కన్నా తోపు అంతే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
Samsung Galaxy S25 FE : శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈకి పోటీగా మార్కెట్లో 5 ఆకర్షణీయమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి..

Samsung Galaxy S25 FE
Samsung Galaxy S25 FE : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల స్మార్ట్ ఫోన్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా (Samsung Galaxy S25 FE) ఇటీవలే లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 FE కన్నా బెటర్ ఫీచర్లను అందిస్తున్నాయి.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. గెలాక్సీ S25 FEకి పోటీగా 5 స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ప్రతి మోడల్ డిజైన్, స్పీడ్, కెమెరా క్వాలిటీ పరంగా అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇదే పోటీ ధర వద్ద మంచి ఫోన్ కోరుకునే కొనుగోలుదారులకు అద్భుతమైన ఫోన్లుగా చెప్పవచ్చు. కొత్త శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ కు పోటీగా నిలిచే స్మార్ట్ ఫోన్లను ఓసారి లుక్కేయండి..
రియల్‌మి GT 7 ప్రో (రూ. 44,999) :
రియల్‌మి GT 7 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 6.78-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. మొబైల్ యూనిట్ 120W టర్బో ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5800mAh బ్యాటరీ, ట్రిపుల్ 50MP+50MP+8MP బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 FEకి పోటీదారుగా చెప్పవచ్చు.
వివో T4 అల్ట్రా (రూ. 37,999) :
వివో T4 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 9300+ 5G చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 90W టర్బో ఛార్జింగ్ ద్వారా సపోర్టుతో 5500mAh బ్యాటరీ, ట్రిపుల్ 50MP+8MP+50MP మెయిన్ కెమెరా, 32MP సెల్ఫీ షూటర్ కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 FEకి నేరుగా పోటీదారుగా నిలుస్తుంది.
Read Also : Apple iPhone 16 Pro : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్రో అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే..!
వన్‌ప్లస్ 13R (రూ. 40,999) :
వన్‌ప్లస్ 13R ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఆక్వా టచ్ 2.0 అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఛార్జింగ్ ద్వారా సపోర్టు అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ప్రాసెసర్‌పై 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ట్రిపుల్ 50MP+8MP+50MP మెయిన్ కెమెరా 16MP కెమెరా కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ కన్నా బెటర్ ఫీచర్లు కలిగి ఉంది.
ఒప్పో రెనో 14 ప్రో (రూ. 49,999) :
ఒప్పో రెనో 14 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 6.83-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్, 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6200mAh బ్యాటరీ, ట్రిపుల్ 50MP+50MP+50MP బ్యాక్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా, శాంసంగ్ గెలాక్సీ S25 FEకి పోటీగా నిలుస్తోంది.
గూగుల్ పిక్సెల్ 9a (రూ. 49,999) :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ టెన్సర్ G4తో రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల యాక్టువా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5100mAh బ్యాటరీ, డ్యూయల్ 48MP+13MP రియర్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. రాబోయే శాంసంగ్ గెలాక్సీ S25 FE కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.