×
Ad

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..

వనపర్తి జిల్లాకు చెందిన వారు యాదాద్రి దైవ దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదానికి గురయ్యారు.

  • Published On : August 15, 2024 / 07:20 PM IST

Road Accident (Photo Credit : Google)

Road Accident : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ క్రూజర్ ని మారుతి బాలెనో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో డ్రైవర్, మహిళ ఉన్నారు.

తుక్కుగూడ నుండి శంషాబాద్ మీదుగా వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లాకు చెందిన వారు యాదాద్రి దైవ దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదానికి గురయ్యారు. ముందు వెళుతున్న తుఫాన్ బండిని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది బాలెనో కారు. కాగా, బాలెనో కారులో ప్రయాణిస్తున్న వారంతా యువకులే. వారంతా సేఫ్ గా బయటపడ్డారు.

Also Read : భార్య అందంగా త‌యార‌వుతోంద‌ని.. న‌లుగురు స్నేహితుల‌తో క‌లిసి భ‌ర్త దారుణం..