NEET PG 2024 Results : నీట్ పీజీ 2024 ఫలితాలు త్వరలో విడుదల.. పూర్తి వివరాలు మీకోసం..!

NEET PG 2024 Results : పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి (NBEMS) అధికారిక వెబ్‌సైట్‌లో వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

NEET PG 2024 Results To Be Out Soon, Check Details ( Image Source : Google )

NEET PG 2024 Results : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (పోస్ట్ గ్రాడ్యుయేట్) (NEET PG) 2024 ఫలితాలు త్వరలో ప్రకటించనుంది. ఫలితాలు ఒకసారి విడుదలైన తర్వాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి (NBEMS) అధికారిక వెబ్‌సైట్‌లో వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. నీట్ స్కోర్‌లను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం 2,28,540 మంది అభ్యర్థులకు ఆదివారం ఆగస్టు 11, 2024న పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 170 నగరాల్లో రెండు షిఫ్టుల్లో 416 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పరీక్షకు సంబంధించిన తాత్కాలిక సమాధానాల కీని బోర్డు త్వరలో రిలీజ్ చేయనుంది. అభ్యర్థులు NBEMS అధికారిక వెబ్‌సైట్‌లో ప్రొవిజనల్ ఆన్సర్ కీని చెక్ చేయొచ్చు.

దరఖాస్తుదారులు ఆన్సర్ కీలో తప్పుగా ఉన్న ఏదైనా సమాధానానికి అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా బోర్డు ఫైనల్ ఆన్సర్ కీని సిద్ధం చేస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను NBEMS ప్రస్తుతం AIIMS-న్యూఢిల్లీ ద్వారా (INI-CET)కి మాత్రమే పరిమితం కాకుండా ఒకటి కన్నా ఎక్కువ షిఫ్ట్‌లలో నిర్వహించే వివిధ పరీక్షలకు ఉపయోగిస్తోంది.

పరీక్షా ప్రోటోకాల్‌లు, స్కోరింగ్ :
నీట్ పీజీ పరీక్షలో తప్పు సమాధానాలకు 25 శాతం నెగెటివ్ మార్కింగ్‌ ఉంటుంది. అటెంప్ట్ చేయని ప్రశ్నలకు ఎలాంటి మినహాయింపులు లేవు. అభ్యర్థులు పరీక్ష సమయంలో రివ్యూ కోసం ప్రశ్నలను గుర్తించడానికి ఆప్షన్ పొందవచ్చు. పరీక్షా సమయం ముగిసేలోపు ఈ ప్రశ్నలను మళ్లీ విజిట్ చేసేందుకు అనుమతిస్తుంది. మీరు గుర్తించిన ప్రశ్నలను మార్కింగ్ స్కీమ్ ప్రకారం పరిగణనలోకి తీసుకుంటారు.

Read Also : NEET UG Counselling 2024 : ఏపీ నీట్ యూజీ కౌన్సెలింగ్ 2024.. అర్హత పొందిన అభ్యర్థుల జాబితా, కట్-ఆఫ్ స్కోర్లు విడుదల

ట్రెండింగ్ వార్తలు