iPhone 15 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 15 Price : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 రూ. 65,499గా జాబితా అయింది. అసలు ధర రూ.79,900 నుంచి తగ్గింది. అయితే, మీకు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఉంటే.. కార్డ్‌లెస్ ఈఎంఐ లావాదేవీలపై రూ.18 వందల వరకు తగ్గింపు పొందవచ్చు.

iPhone 15 down to Rs 63k on Flipkart with bank offers

iPhone 15 Price : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. వచ్చే నెల సెప్టెంబర్‌లో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్‌కు రెడీగా ఉంది. మీరు కొత్త ఐఫోన్ సిరీస్‌ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటే, ఐఫోన్ 15 తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Read Also : Apple iPhone 15 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లు, మరెన్నో డీల్స్..!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ ఐఫోన్ 15 భారీ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉంది. గత జనరేషన్ ఐఫోన్లలో ఐఫోన్ 15 సిరీస్ ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత పవర్‌ఫుల్ ఫోన్లు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. మీరు సరైన బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. ఈ ఐఫోన్ ధరను రూ.63వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 15 డీల్ ఎలా పనిచేస్తుందంటే?:
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 రూ. 65,499గా జాబితా అయింది. అసలు ధర రూ.79,900 నుంచి తగ్గింది. అయితే, మీకు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఉంటే.. కార్డ్‌లెస్ ఈఎంఐ లావాదేవీలపై రూ.18 వందల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ.63,699కి తగ్గింది.

మీరు కార్డ్‌లెస్ ఈఎంఐ లావాదేవీలను ఎంచుకుంటే ఫోన్‌పై అదనంగా రూ. 1000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాత ఐఫోన్‌ను కలిగి ఉంటే.. మీ ఫోన్‌లో ట్రేడింగ్ చేయవచ్చు. తద్వారా రూ. 55వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్‌లు :
ఐఫోన్ 15 6.1-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ వంటి మొత్తం 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది: ఈ మోడల్ ఐఫోన్ 14 లేదా గత మోడళ్ల మాదిరిగా డిజైన్ కలిగి ఉంది. అయితే, గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మోడల్‌ల నుంచి పాపులర్ ఫీచర్ అయిన డైనమిక్ ఐలాండ్ నాచ్‌తో సాంప్రదాయ నాచ్‌ను రిప్లేస్ చేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 15 48ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో అప్‌గ్రేడ్‌ను అందిస్తుంది. తక్కువ కాంతిలోనూ ఫొటోగ్రఫీ, అద్భుతమైన పోర్ట్రెయిట్ షాట్‌లను అందిస్తుంది. ఈ ఫోన్ రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుందని ఆపిల్ పేర్కొంది. ఇటీవలి నివేదికలో ఐఫోన్ బ్యాటరీ లైఫ్ రెట్టింపు అందిస్తుందని సూచిస్తుంది. ఐఫోన్ 15 మోడల్ 80 శాతం బ్యాటరీ హెల్త్ 500 ఛార్జింగ్ సైకిళ్లను భరించగలదు. అయితే, ఆపిల్ ఇప్పుడు 1000 సైకిళ్లను బ్యాటరీ తట్టుకోగలదని పేర్కొంది.

ఆపిల్ ఐఫోన్ 15 ఎ16 బయోనిక్ చిప్‌తో వస్తుంది. గత ఏడాదిలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఉపయోగించిన A15 బయోనిక్ చిప్‌సెట్ నుంచి అప్‌గ్రేడ్ అయింది. ఐఫోన్ ప్రో మోడల్‌లు గత ఏడాదిలో A16 చిప్‌ను అందుకున్నాయి. ఐఫోన్ 15లో చెప్పుకోదగ్గ మార్పు యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌కి మారడమే. మీరు ఐఫోన్ 15 కొనుగోలు చేయాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది.

Read Also : Mahindra Thar Roxx : మహీంద్రా థార్ రోక్స్ 5-డోర్ కారు వచ్చేస్తోంది.. పూర్తి డిజైన్, ఫీచర్ల వివరాలు లీక్..

ట్రెండింగ్ వార్తలు