Apple iPhone 15 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లు, మరెన్నో డీల్స్..!

Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15 (128జీబీ, బ్లాక్) ప్రస్తుతం అమెజాన్‌లో రూ.79,900కి అందుబాటులో ఉంది. 11శాతం డిస్కౌంట్ ద్వారా ఐఫోన్ ధర రూ.70,999కి పొందవచ్చు.

Apple iPhone 15 Discount  : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లు, మరెన్నో డీల్స్..!

Apple iPhone 15 available ( Image Source : Google )

Apple iPhone 15 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పటికీ కొనుగోలుదారులు ఐఫోన్ కొనుగోలుపై గణనీయమైన తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుత ఆఫర్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఐఫోన్ 15 (128జీబీ, బ్లాక్)ని కేవలం రూ. 20,150కి అమెజాన్ అందిస్తోంది. ఈ మోడల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఆకర్షణీయమైన అవకాశంగా చెప్పవచ్చు.

Read Also : SpaceX Satellites Crash : స్పేస్ఎక్స్‌కు తీరని ఎదురుదెబ్బ.. భూమిపై కూలిపోనున్న 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు!

ఐఫోన్ 15 (128జీబీ, బ్లాక్) ప్రస్తుతం అమెజాన్‌లో రూ.79,900కి అందుబాటులో ఉంది. 11శాతం డిస్కౌంట్ ద్వారా ఐఫోన్ ధర రూ.70,999కి పొందవచ్చు. అదనంగా, కస్టమర్‌లు తమ పాత ఫోన్‌ను వర్కింగ్ కండిషన్‌లో ట్రేడింగ్ చేయడం ద్వారా రూ. 44,925 వరకు ఆదా చేసుకోవచ్చు. ఐఫోన్ 15 ధరను రూ. 26,074కి తగ్గించవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు రూ. 5,924 వరకు తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 15 తుది ధర కేవలం రూ. 20,150కి తగ్గింది.

ఆపిల్ ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే, డిజైన్ : ఐఫోన్ 15 6.1-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. గత మోడళ్ల డిజైన్‌ను ఐఫోన్ 14 ప్రో మోడళ్ల నుంచి పాపులర్ ఫీచర్ డైనమిక్ ఐలాండ్ నాచ్‌ని ప్రవేశపెట్టింది.

కెమెరా అప్‌గ్రేడ్‌లు : ఆపిల్ ఐఫోన్ 15లో 48ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్ కలిగి ఉంది. ముందున్న దానితో పోలిస్తే.. తక్కువ-కాంతిలోనూ పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీలో మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

బ్యాటరీ లైఫ్ : ఆపిల్ ఐఫోన్ 15 “రోజంతా బ్యాటరీ లైఫ్” అందిస్తుంది. సాధారణ ఉపయోగంతో 9 గంటలకు పైగా ఉంటుంది.

ప్రాసెసర్ : ఈ ఐఫోన్ A16 బయోనిక్ చిప్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లలో ఉపయోగించిన A15 చిప్ నుంచి అప్‌గ్రేడ్ అయింది. ఐఫోన్ ప్రో మోడల్‌లు కూడా A16 చిప్‌ను కలిగి ఉంటాయి.

ఛార్జింగ్ పోర్ట్ : ఐఫోన్ 15 ఇప్పుడు యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంది. గత లైట్నింగ్ పోర్ట్‌ స్థానంలో యూఎస్బీ టైప్-సితో వస్తుంది.

Read Also : Motorola Edge 50 Neo : అదిరే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 5o నియో ఫోన్.. మొత్తం 4 కలర్ ఆషన్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?