Mahindra Thar Roxx Price : హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కు పోటీగా మహీంద్రా థార్ రోక్స్ కారు.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇవే..!

Mahindra Thar Roxx Price : థార్ రోక్స్ మోడల్ ద్వారా రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో రూ. 12.50 లక్షల ధరల విభాగంలో అతిపెద్ద ఎస్‌యూవీ ప్లేయర్‌గా అవతరించాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది.

Mahindra Thar Roxx price details out, aims to take on Hyundai Creta, Kia Seltos ( Image Source : Google )

Mahindra Thar Roxx Price : కారు వినియోగదారుల కోసం కొత్త థార్ రోక్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇతర పోటీదారులైన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కు పోటీగా మహీంద్రా అండ్ మహీంద్రా మహీంద్రా థార్ రోక్స్ తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన వేరియంట్‌లతో కార్ల ధరలను ప్రకటించింది. కొత్త ఎస్‌యూవీ 5-డోర్ల అవతార్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడేలా ఉంది. అయితే, ఆఫ్-రోడర్ కారు కావడంతో మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖాలను కూడా పోటీగా నిలువనుంది.

అతిపెద్ద ఎస్‌యూవీ ప్లేయర్‌గా లక్ష్యం :
థార్ రోక్స్ మోడల్ ద్వారా రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో రూ. 12.50 లక్షల ధరల విభాగంలో అతిపెద్ద ఎస్‌యూవీ ప్లేయర్‌గా అవతరించాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పాపులర్ స్కార్పియో, ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌యూవీ700తో బలమైన పోటీని కలిగి ఉంది. స్కార్పియో టాప్ పొజిషన్‌లో ఉండగా, వాల్యూమ్స్ పరంగా XUV700 ఐదవ స్థానంలో నిలిచింది. మహీంద్రా థార్ రోక్స్ 60 పేటెంట్లతో మార్కెట్లోకి ప్రవేశించింది. 179కిలోల వద్ద 18శాతం తేలికగా ఉండటమే కాకుండా 41శాతం అధిక బెండింగ్ ఫ్రీక్వెన్సీ, 51శాతం హై టోర్షనల్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. ఇందులో 88శాతం స్టీల్‌ను ఉపయోగించారు.

Read Also :  Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డీల్.. ధర ఎంత తగ్గిందంటే? మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!

ఎస్‌యూవీ అధునాతన (4X4) సామర్ధ్యం, ఫ్రంట్ ఇండిపెండెంట్ డబుల్-విష్‌బోన్ సస్పెన్షన్, బ్యాక్ పెంటా-లింక్ సస్పెన్షన్, అధునాతన డంపర్ టెక్నాలజీలను (ఫ్రీక్వెన్సీ-డిపెండెంట్ డంపింగ్, హైడ్రాలిక్ రీబౌండ్ స్టాపర్, మల్టీ-ట్యూన్ వాల్వ్ పొందుతుంది. ఫ్రంట్, బ్యాక్ రెండింటిలోనూ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్, ఎలక్ట్రిక్ లాకింగ్ డిఫరెన్షియల్‌ను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ కూడా ఉంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ (రెండూ 2610ఎమ్ఎమ్ వీల్‌బేస్ ఉన్నాయి. మహీంద్రా థార్ రోక్స్ 2,850ఎమ్ఎమ్ వద్ద లాంగ్ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. కొత్త ఎస్‌యూవీ భారీ 644 లీటర్ల బూట్‌ను కలిగి ఉంది.

ధార్ రోక్స్ అత్యాధునిక స్పెషిఫికేషన్లు :
అనేక ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. అందులో అత్యంత శక్తివంతమైనవి జీ20 టీజీడీఐ ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ (177పీఎస్, 380ఎన్ఎమ్) డీ22 ఎమ్‌హాక్ డీజిల్ (175పీఎస్, 370ఎన్ఎమ్). ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ ఎంటీ 6-స్పీడ్ ఐసిన్ ఎంటీ ఉన్నాయి. ఎస్‌యూవీ ఆర్‌డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ రెండింటినీ కలిగి ఉంది. రెండు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. అందులో జిప్, జూమ్.. సాండ్, మడ్ స్నో మూడు టెర్రైన్ మోడ్‌లు ఉన్నాయి. ఇంకా, స్మార్ట్ క్రాల్ (4X4) ఇంటెలిటర్న్ (4X4) ఫీచర్లను పొందుతుంది.

ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లకు 162పీఎస్, 330ఎన్ఎమ్ పెట్రోల్, 152పీఎస్, 330ఎన్ఎమ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. మహీంద్రా థార్ రోక్స్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌తో సహా 35 కన్నా ఎక్కువ ప్రామాణిక సెక్యూరిటీ ఫీచర్లతో వస్తుంది. వెలుపల, అన్ని ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది (హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్ఎల్, ఫాగ్ ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్‌లు). కొత్తగా రూపొందించిన 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై రన్ అవుతుంది.

ఎస్‌యూవీ ఫీచర్ల విషయానికి వస్తే..
ఇందులో 10.25-అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌లు (టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్), ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సిక్స్ వే పవర్డ్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, 9 స్పీకర్‌లతో కూడిన హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్ ఉన్నాయి. 360-డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.

అడ్రినోక్స్ టెక్నాలజీ 80 కన్నా ఎక్కువ కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది. అలాగే, లెవెల్-2 అడాస్ కూడా ఉంది. ఎక్స్‌యూవీ 700, కొత్త ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ తర్వాత థార్ రోక్స్‌ని థర్డ్ మహీంద్రా ఎస్‌యూవీగా మార్చింది. ప్రస్తుతానికి, మహీంద్రా థార్ రోక్స్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌ల ధరలను మాత్రమే ప్రకటించింది. ఏడబ్ల్యూడీ వేరియంట్‌ల ధరలతో కూడిన పూర్తి ధర జాబితా తర్వాత వెల్లడి కానుంది.

వేరియంట్ వారీగా మహీంద్రా థార్ రోక్స్ (ఎక్స్-షోరూమ్) ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి

  • ఎమ్ఎక్స్1 ఆర్‌డబ్ల్యూడీ పెట్రోల్ ఎంటీ – రూ. 12.99 లక్షలు
  • ఎమ్ఎక్స్1 ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎంటీ – రూ. 13.99 లక్షలు
  • ఎమ్ఎక్స్3 ఆర్‌డబ్ల్యూడీ పెట్రోల్ ఎటీ – రూ. 14.99 లక్షలు
  • ఎమ్ఎక్స్3 ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎంటీ – రూ. 15.99 లక్షలు
  • ఎఎక్స్3ఎల్ ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎంటీ – రూ. 16.99 లక్షలు
  • ఎమ్ఎక్స్5 ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎంటీ – రూ. 16.99 లక్షలు
  • ఎఎక్స్5ఎల్ ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎటీ – రూ. 18.99 లక్షలు
  • ఎఎక్స్7ఎల్ ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎంటీ – రూ. 18.99 లక్షలు

మహీంద్రా థార్ రోక్స్ టెస్ట్ డ్రైవ్‌లు సెప్టెంబర్ 14న ప్రారంభం కాగా, ఎస్‌యూవీ బుకింగ్‌లు అక్టోబర్ 3న ప్రారంభమవుతాయి. డెలివరీలు ఈ దసరా నుంచి ప్రారంభం కానున్నాయి.

Read Also : iQOO Z9 Pro Series : ఈ నెల 21న ఐక్యూ Z9 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెసిఫికేషన్‌లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు