iQOO Z9 Pro Series : ఈ నెల 21న ఐక్యూ Z9 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెసిఫికేషన్‌లు లీక్..!

iQOO Z9 Pro Series Launch : ఐక్యూ Z9ఎస్, ఐక్యూ Z9ఎస్ ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని కంపెనీ అధికారిక మైక్రోసైట్‌లో ధృవీకరించింది. ఐక్యూ ప్రో వెర్షన్ 4,500నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయికి సపోర్టు ఇస్తుంది.

iQOO Z9 Pro Series : ఈ నెల 21న ఐక్యూ Z9 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెసిఫికేషన్‌లు లీక్..!

iQOO Z9s And Z9s Pro Key Specifications Revealed Ahead of August 21 India Launch ( Image Source : Google )

Updated On : August 15, 2024 / 3:55 PM IST

iQOO Z9 Pro Series Launch : ఐక్యూ జెడ్9ఎస్, ఐక్యూ జెడ్9ఎస్ ప్రో మోడల్ ఆగస్టు 21న భారత మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ గతంలో స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్, కలర్ ఆప్షన్లు, చిప్‌సెట్ వివరాలను వెల్లడించింది. ఐక్యూ జెడ్9ఎస్ ఒక మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. అయితే, ఐక్యూ జెడ్9ఎస్ ప్రో స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్‌ను పొందుతుంది. ఇప్పుడు, ఐక్యూ రాబోయే హ్యాండ్‌సెట్‌ల డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యం, ఐపీ రేటింగ్‌తో సహా అనేక మరిన్ని ఫీచర్లను ధృవీకరించింది.

Read Also : Google Pixel 9 Series : అత్యాధునిక ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్.. భారత్‌లో కొత్త వాక్-ఇన్ రిటైల్ స్టోర్లు, సర్వీసు సెంటర్లు ఓపెనింగ్..!

ఐక్యూ Z9ఎస్, ఐక్యూ Z9ఎస్ ప్రో కీలక ఫీచర్లు :
ఐక్యూ Z9ఎస్, ఐక్యూ Z9ఎస్ ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని కంపెనీ అధికారిక మైక్రోసైట్‌లో ధృవీకరించింది. ఐక్యూ ప్రో వెర్షన్ 4,500నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయికి సపోర్టు ఇస్తుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ64-రేటెడ్ బిల్డ్‌లతో వస్తాయని నిర్ధారించింది. ఈ ఫోన్‌లు 0.749సెం.మీ (7.49ఎమ్ఎమ్) మందం కలిగి ఉంటాయి.

ఐక్యూ Z9ఎస్, ఐక్యూ Z9ఎస్ ప్రో రెండూ 5,500mAh బ్యాటరీలను పొందుతాయి. ఐక్యూ ప్రో ఆప్షన్ కూడా 80డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఐక్యూ జెడ్9 ఛార్జింగ్ సామర్థ్యం ఇంకా నిర్ధారించలేదు. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐక్యూ Z9ఎస్, ఐక్యూ Z9ఎస్ ప్రోలు డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లను కలిగి ఉన్నాయి.

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50ఎంపీ ఐఎమ్ఎక్స్882 ప్రైమరీ సెన్సార్‌తో సహా బేస్ వెర్షన్ 2ఎంపీ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఐక్యూ ప్రో వేరియంట్ 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను పొందుతుంది. రెండు హ్యాండ్‌సెట్‌లలోని సెన్సార్‌లు 4కె ఓఐఎస్-సపోర్టెడ్ వీడియో రికార్డింగ్‌ను అందిస్తాయి. అలాగే, ఏఐ ఫొటో ఎన్‌హాన్స్, ఏఐ ఎరేస్ వంటి ఏఐ-సపోర్టు గల ఫీచర్‌లను అందిస్తాయి.

గతంలో, మైక్రోసైట్ ఐక్యూ Z9ఎస్, ఐక్యూ Z9ఎస్ ప్రోలు వరుసగా మీడియాటెక్ డైమన్షిటీ 7300, స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్‌ల ద్వారా పవర్ అందిస్తుందని వెల్లడించింది. వెనిలా ఐక్యూ Z9ఎస్ మోడల్ ఒనిక్స్ గ్రీన్, టైటానియం మ్యాట్ షేడ్స్‌లో అందిస్తుంది. ఐక్యూ ప్రో వెర్షన్ ఫ్లాంబోయంట్ ఆరెంజ్, లక్స్ మార్బుల్ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంటుంది.

Read Also : iPhone 15 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ డీల్ ఎలా పొందాలంటే?