AP Council Atchannaidu: హిందూ vs క్రిస్టియన్ వివాదం.. క్షమాపణలు చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు
మతాల ప్రస్తావన రావడంతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో మతాల ప్రస్తావన అగ్గి రాజేసింది. చివరకు మంత్రి అచ్చెన్నాయుడు... మండలి ఛైర్మన్ కి క్షమాపణలు తెలిపారు. తిరుమల లడ్డూ వివాదం అంశంపై చర్చిస్తున్న తరుణంలో మండలిలో మతాల ప్రస్తావన వచ్చింది.
ap legislative council 2026 minister atchannaidu comments tirumala laddu controversy
AP Council Atchannaidu: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాల్లో మతాల ప్రస్తావన చిచ్చు రాజేసింది. మండలి సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. మంత్రి వ్యాఖ్యలపై ఛైర్మన్ స్పందిస్తూ.. తాను క్రిస్టియన్ కాదని, హిందువునేనని ప్రకటించారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు మండలి ఛైర్మన్‌కు క్షమాపణలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు ‘తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ’ అంశం చర్చకు వచ్చింది. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా, వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20 పేజీల నివేదికలోని అంశాలు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆధారాలతో సహా సభ ముందు ఉంచడంతో వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, వ్యక్తిగత విమర్శలు, చివరికి క్షమాపణలతో మండలిలో గంటల తరబడి ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.
ఏపీలో కీలక పరిణామం.. మండలి ఛైర్మన్‌పై అవిశ్వాసం.. ఆ వైసీపీ ఎమ్మెల్సీల ప్లాన్
తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చర్చించాలంటూ కూటమి సభ్యులు చేసిన ప్రతిపాదనను మండలి చైర్మన్ మోషన్ రాజు అనుమతించారు. ఈక్రమంలో వైసీపీ సభ్యులు తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చర్చను కొనసాగిస్తూ.. ఈ అనర్థం కూటమి పాలనలో జరిగిందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈక్రమంలో వైసీపీ సభ్యులు హెరిటేజ్ కంపెనీపై కూడా ఆరోపణలు చేయగా.. మంత్రి నారా లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడు ఇతర కూటమి సభ్యులు ఖండించారు. ఈ క్రమంలోనే మండలిలో మతాల ప్రస్తావన వచ్చింది. దీంతో అచ్చెన్నాయడు… కూటమి ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూటమి ఛైర్మన్ తో పాటు.. వైసీపీ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక.. క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు.
